
సౌదీ అరేబియా ప్రిన్స్ అల్‌వలీద్ బిన్ ఖలెద్(36) ఇక లేరు. గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్న ఆయన.. శనివారం కన్నుమూశారు. ఈ కారణంగానే సౌదీ అరేబియా స్లీపింగ్ ప్రిన్స్‌గా ఈయనకంటూ ఓ పేరు ముద్రపడిపోయింది.
ప్రిన్స్ అల్‌వలీద్ బిన్ ఖలెద్ సౌదీ అరేబియా రాజ కుటుంబానికి చెందినవారు. ఆయన ప్రిన్స్ ఖలెద్ బిన్ తలాల్ అల్ సౌద్ పెద్ద కుమారుడు. 2005లో లండన్‌లోని మిలిటరీ అకాడమీలో చదువుకుంటున్న టైంలో ఖలెద్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. మెదడులో రక్తస్రావం జరిగి.. వెంటిలేటర్‌పై కోమాలో ఉంటూ ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఖలెద్ కోసం అమెరికా, స్పెయిన్ నుండి నిపుణులు కూడా చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జూలై 20న రియాద్‌లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.
Statement On the Passing of Prince Alwaleed bin Khaled bin Talal Al Saud pic.twitter.com/st19kxb7lC
— Global Imams Council (GIC) (@ImamsOrg) July 19, 2025