ప్రొఫెసర్ సయ్యద్ రబ్బానీ(రియాధ్), ముమ్మడి బాలిరెడ్డి(కువైట్)
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. గల్ఫ్ దేశాలలో వైఎస్సార్‌సీపీ కన్వీనర్లను నియమిస్తూ.. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
కువైట్-ముమ్మడి బాలిరెడ్డి, రియాధ్(సౌదీ అరేబియా)-ప్రొఫెసర్ సయ్యద్ రబ్బానీ, జుబైల్- శేఖ్ మహెబూబ్ ఇలాహీ, బహ్రెయిన్- ఒర్సు నాగరాజు, దుబాయి-సయ్యద్ అక్రం, ఒమాన్- జి.జి. భాస్కర్‌రావులను కన్వీనర్లుగా పార్టీ నియమించింది.


