‘చంద్రబాబు తీరుతో రాష్ట్రానికి తీవ్రమైన నష్టం’ | SV Satish Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు తీరుతో రాష్ట్రానికి తీవ్రమైన నష్టం’

Feb 3 2026 3:34 PM | Updated on Feb 3 2026 4:35 PM

SV Satish Reddy Fires On Chandrababu Naidu

కడప:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుతో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్‌ చేసేందుకు ఈ దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, మరి దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు  తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ‘తిరుమల లడ్డూపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం ఆపడం లేదు. 

డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసేందుకు ఈ దాడులు. బాధితులపైనే పోలీసులు తిరిగి కేసులు పెట్టడం దారుణం. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్‌ చేసేందుకు చంద్రబాబు దాడులు చేయిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షం ప్రశ్నించడం తప్పా. చంద్రబాబు నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇచ్చారా?, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు.  

హామీల అమలుపై కూటమి నేతలు చర్చకు సిద్ధమా?, తిరుమల లడ్డూ  వ్యవహారంలో చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. వెంకటేశ్వరస్వామి శిక్ష నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా  ఉన్న ఏపీలోని కూటమి సర్కార్‌.. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చిందో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

తప్పించుకోలేరు.. సతీష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్

Advertisement
 
Advertisement
Advertisement