తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అరుదైన ఫీట్ సాధించారు. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని ‘కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’లో లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి సర్టిఫికెట్ అందుకున్న విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో స్వయంగా తెలియజేశారాయన.
ఈ నెల 25 నుంచి 30 వరకు ‘లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ పేరిట నిర్వహించిన తరగతులకు ఆయన హాజరైన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన ఎక్స్‌లో షేర్ చేసుకున్నారు. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి తరగతులకు హాజరైనట్లు.. టీచర్స్, తోటి విద్యార్థుల నుంచి ఎంతో నేర్చున్నట్లు తెలిపారు.
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో నిర్వహించిన ‘లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇక్కడి ప్రతికూల వాతావరణంలోనే నా ఈ కోర్సు పూర్తైంది. ఆ సమయంలో అధ్యాపకులు, తోటి విద్యార్థుల రూపంలో అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నాను. వాళ్ల నుంచి ఎంతో విలువైన పాఠాలు నేర్చుకున్నాను అని ట్వీట్ చేశారాయన.
With great delight and modest accomplishment I wish to share that I have completed my executive education program “Leadership in the 21st century”at the prestigious #Harvard @Kennedy_School today.
The class of over 60 students from 20 countries meant acquiring learnings not… pic.twitter.com/54azRDuL3v— Revanth Reddy (@revanth_anumula) January 30, 2026


