ఫోటో దిగుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయి.. | Tragedy At Celebration, Woman Suddenly Collapses During Photoshoot And Dies Of Heart Attack, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ఫోటో దిగుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయి..

Mar 16 2026 3:27 PM | Updated on Mar 16 2026 4:09 PM

Tragedy at Celebration: A Woman Dies Of Heart Attack In Khammam

ఖమ్మం:  ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా స్టేజ్‌లపైనే కుప్పకూలిపోయి మృత్యువాత పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లి గుండె పోటుతో మృతి చెందిన ఘటన వెలుగుచూసింది.  తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరానికి చెందిన ఓ మహిళ.. బంధువుల గృహ ప్రవేశ వేడుకకు వెళ్లింది. 

అయితే అక్కడ ఫోటో దిగుతున్న సందర్భంలో పక్కనున్న మరొక మహిళతో మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయింది. ఆ మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. 

ఖమ్మం టూటౌన్‌కు చెందిన బొమ్మ సుస్మిత అనే మహిళ..  ఖమ్మంలోని ఓ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లారు. అయితే అప్పటివరకూ అందరితో కలివిడిగా మాట్లాడుతూ తిరిగిన మహిళ.. ఫోటో దిగుతున్న సమయంలో గుండెపోటుకు లోనైంది.  ఒక్కసారిగా పక్కనున్న మహిళపై చేయి వేస్తూనే కుప్పకూలిపోయింది.  వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 

వేదికపై ఫోటో దిగుతూ గుండెపోటుతో మహిళ మృతి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement