మూన్‌లైటింగ్ ఆరోపణలపై భారత సంతతికి చెందిన వ్యక్తికి 15ఏళ్ల జైలు శిక్ష విధించిన వార్త ఇంటర్నెట్‌లో దావాలనం వ్యాపించింది. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్‌లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన మెహుల్ గోస్వామిని యుఎస్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం అరెస్టు చేశారు.2022 మార్చిలో గోస్వామి మాల్టాలోని ఒక సెమీకండక్టర్ కంపెనీకి కాంట్రాక్టర్‌గా పనిచేశాడు. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్‌లో రిమోట్ వర్క్(work from home) తోపాటు, మాల్టాలోని సెమీకండక్టర్ కంపెనీకి కాంట్రాక్టర్‌గా పనిచేసేవాడు.
ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నగోస్వామి మాల్టా పట్టణంలో మరో కాంట్రాక్ట్ ఉద్యోగం చేయడాన్ని నేరంగా పరిగణించింది. గోస్వామిపై అందిన ఫిర్యాదును విచారణ చేపట్టిన మోహుల్ గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. గోస్వామి మూన్ లైటింగ్ కారణంగా రాష్ట్రఖజానాకు రూ.44 లక్షల నష్టం జరిగిందని అధికారులు భావించారు. దీన్ని విచారించిన కోర్టు గోస్వామికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డ్యూయల్ ఎంప్లాయ్ మెంట్ రూల్ ప్రకారం అమెరికాలో రెండు ఉద్యోగాలు చేయడం నేరం అని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం ప్రజలను మోసం చేయడమే అని, ప్రజా వనరుల దుర్వినియోగం అని పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీతో సేవ చేసే బాధ్యత ఉంది కానీ గోస్వామి ఆరోపించిన ఆ నమ్మకాన్ని తీవ్రంగా ఉల్లంఘించాడని న్యూయార్క్ స్టేట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ అన్నారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రెండో పూర్తికాలం ఉద్యోగం చేయడం అంటే ప్రజల డబ్బుతోపాటు ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడమే అవుతుందని లూసీ లాంగ్ పేర్కొన్నారు.
ఏంటీ నేరం; ఏలాంటి శిక్ష
సరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ,రాష్ట్ర ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయం ఈ విషయంపై సంయుక్త దర్యాప్తు చేపట్టి,గోస్వామి అరెస్టు చేసింది. సొంత పూచీకత్తుపై విడుదలయ్యాడు. ఈ కేసు ప్రస్తుతం తదుపరి చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉంది. రెండవ డిగ్రీలో గ్రాండ్ చోరీ అభియోగం మోపబడింది, ఇది న్యూయార్క్‌లో తీవ్రమైన క్లాస్ సి నేరం. ఈ నేరం రుజువైతే గోస్వా మికి గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.13 లక్షల వరకు లేదా పొందిన ఆర్థిక ప్రయోజనా లకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది.
చదవండి: ఇషా, ఆకాష్ అంబానీ బర్త్‌డే: తరలి వెళ్లిన తారలు
డాలర్లకు కక్కుర్తిపడితే
డాలర్లకు ఆశ పడి విదేశాల్లో ఉద్యోగాలు చేసకుంటున్న నిపుణులైన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షలకోసం ఆశపడితే దేశం పరువు ప్రతిష్టలకు భంగం కలగడంతో పాటు,వ్యక్తిగతంగా కూడా భారీ నష్టం తప్పదని ఉద్యోగులు నిబద్దతగా నిజీయితీగా ఉండాలని సూచిస్తున్నారు.
గతంలో అమెరికా సంస్థలతో మూన్‌లైట్ చేస్తూ మరో భారతీయుడు పరేఖ్, పట్టుబడ్డాడు. మూన్ లైటింగ్ ద్వారా ఐదు యుఎస్ స్టార్టప్‌లను మోసం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాన్ని మొదట మిక్స్‌ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ CEO సుహైల్ దోషి సోషల్‌మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే.
(రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)


