
ప్రముఖ టెక్ సంస్థ మెటా మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్దమైంది. మెటాలోని సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ విభాగం నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ నేపథ్యంలో ఒక భారతీయ స్టార్టప్ సంస్థ వార్తల్లో నిలిచింది. మెటాలో ఉద్యోగాలు కోల్పోయిన 600 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చారు. అంతేకాదు భారీగా వేతనాలు ఆఫర్ చేయడం విశేషంగా నిలిచింది.
ఇదీ చదవండి: కేరళలో పెళ్లి వైరల్ : ఎన్‌ఆర్‌ఐలకు పండగే!
స్మాలెస్ట్ ఏఐ(Smallest AI_ వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ (Sudarshan Kamath) మెటాలో ఉద్వాసనకు గురైన 600 ఉద్యోగులకు భారీ ఊరట కల్పించారు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన స్టార్టప్ స్మాలెస్ట్ AI బాధిత ఉద్యోగులకు బహిరంగ నియామక ఆహ్వానాన్ని పోస్ట్ చేశారు. రతీయ సంతతికి చెందిన వ్యవస్థాపకుడు వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ సోషల్ మీడియాలో మాజీ మెటా సిబ్బంది, తమ స్పీచ్ AI బృందంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ట్వీట్ చేశారు. రూ. 1.75 కోట్లనుంచి. 5.27 కోట్ల దాకా వేతనాన్ని, ఈక్విటీని ఆఫర్ చేస్తున్నారు. అభ్యర్థులకు స్పీచ్ మూల్యాంకనం, స్పీచ్ జనరేషన్ , ఫుల్ -డ్యూప్లెక్స్ స్పీచ్-టు-స్పీచ్ సిస్టమ్‌లో నిపుణులై ఉండాలి. ప్రస్తుత పోటీ నేపథ్యంలో స్మార్ట్‌గా, ఉద్యోగ ఆకాంక్షతో ఉన్నవాళ్లకే చాన్స్ అన్నారు. <
Laid off from Meta?
We are hiring in speech team for Smallest AI in San Francisco!
Comp - 200-600K $ base
Equity - Flexible
Looking for - experience with speech evals, speech generation, full duplex speech to speech
Must be - fkin smart and hungry.
DM me.— Sudarshan Kamath (@kamath_sutra) October 23, 2025
p;
ప్రధానంగా ఈ తొలగింపులు మెటా తన ఫండమెంటల్ AI రీసెర్చ్ (FAIR) యూనిట్, ప్రోడక్ట్ ఏఐ, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లపై ఉండనుంది. ఉద్యోగాలు కోల్పోయేవారు ఇతర విభాగాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. నవంబర్ 21 వరకు కనీసం 16 వారాల జీతంతో సహా తొలగించబడిన కొంతమంది ఉద్యోగులను అంతర్గతంగా తిరిగి కేటాయించవచ్చని వెల్లడించింది.