సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు లేకుండానే ఖజానా నుంచి వేతనా లు పొందుతున్న కుంభకోణంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వేతనాల బిల్లులకు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందిలో భారీ తేడాలు గమనించిన ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులు, వారి ఆధార్ కార్డులతో అనుసంధానం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై పలు విభాగాల నుంచి తమకు ఈ ఉద్యోగులు అవసరం లేదంటూ సరెండర్ చేస్తూ ఆర్థిక శాఖకు నివేదికలు పంపించాయి. దాదాపు ఏడాదికి ఆరేడు వందల కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వ ఖజానాకు భా రం పడుతూ వచ్చింది.
ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారే బినామీలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచే యడం, నాన్ మస్టర్ రోల్‌లో ఉంటూ పనిచేస్తున్న ట్టు వేతనాలు తీసుకుంటున్నారు. ఇందుకు ఆయా విభాగాల్లోని అధికారులు కూడా కుమ్మక్కై ఈ దందాను కొనసాగిస్తూ వచ్చారు. చాలామంది అధికారులు ఉద్యోగులు తప్పుడు లెక్కలు చూపించి ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసినట్టు దాదాపు ఖరారు కావడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
ఈ విధంగా ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన అధికారులెవరు ? ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. బినామీలుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా కూడా వేతనాలు పొందినట్టు ఆధారాలు లభించడంతో.. మొత్తంగా దీనిపై విచారణకు ఆదేశించారు. ఆర్థికశాఖ డేటా బేస్‌లోని గణాంకాలకు, క్షేత్రస్థాయి విధుల్లో ఉన్న సంఖ్యకు భారీ వ్యత్యాసాలు ప్రధానంగా వైద్యారోగ్యం, పంచాయతీరాజ్, పురపాలక శాఖలు ఉన్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్నా.. క్షేత్రస్థాయిలోకి వచ్చే సరికి వారి జాడ లేదని తేలింది. ఆర్థిక డేటా బేస్‌లో ఉన్న ఉద్యోగుల వివరాలు, జీత భత్యాల చెల్లింపుల లెక్కలు, రికార్డులు, ఇతర సమాచార మంతా విజిలెన్స్ అధికారులకు అందించనున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల కోడ్ ముగిశాక డీఏ?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో కరువు భత్యంతో కూడిన వేతనం అందించనున్న ట్టు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం వద్ద ఇప్ప టికే ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి, అందులో ఒక డీఏను విడుదల చేయడానికి సిద్ధమైనట్లు సమా చారం. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా డీఏను ప్రకటించడం లేదని తెలిసింది. ఎన్నికలు ముగిసిన వెంటనే ఉద్యోగులకు 3.64% కరువు భత్యం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిసింది. కొత్త కరువు భత్యం అమలుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ. 300 కోట్ల అదనపు భారం పడనుంది.


