ఢిల్లీ పొగమంచు తెలుగు రాష్ట్రాలకు చాలా దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ హైదరాబాద్ కూడా ఇప్పుడు కాలుష్యపు ముప్పును ఎదుర్కొంటోంది, ఈ సంవత్సరం మొదటిసారిగా గాలి నాణ్యత (ఏక్యుఐ) ప్రమాదకరమైన ప్రాంతంలోకి జారుకుంటోంది. వాస్తవానికి, గత ఏడు రోజులుగా నగరపు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. బెంగళూరు, చెన్నై కంటే అధ్వాన్నంగా మారినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
గత నవంబర్ 28న నగరం సంవత్సరంలోనే అత్యంత కాలుష్యపు గాలి తాకిడిని చవి చూసింది. కాలుష్య స్థాయిలు ‘తీవ్రమైన‘ స్థితికి దగ్గరగా చేరుకోవడంతో నగరంలోని పలు ప్రాంతాలు విషపూరిత పొగమంచుతో కప్పబడిపోతున్నాయి. అనేక స్టేషన్లలో గాలి నాణ్యత సూచిక (ఏక్యుఐ) 200 దాటింది. ఈ పరిమితి, రోజుకు 8–10 సిగరెట్లు తాగడం వల్ల కలిగే నష్టానికి సమాన స్థితిని ప్రతిబింబిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏక్యుఐ 209కి పెరిగింది, ఇది కేవలం నాలుగు రోజుల్లోనే రెట్టింపు అయింది. ఐఐటిహెచ్ కంది 107 నుంచి 195కి పెరిగింది, అయితే గతంలోని 110 రీడింగ్‌ల తర్వాత సనత్‌నగర్ పైపైకి ఎగబాకి 206కి చేరుకుంది. జూ పార్క్, ఐడిఎ పాశమైలారం ఒక్కొక్కటి 204ను నివేదించాయి. పటా¯Œ చెరు కూడా 206 వద్ద అధిక–ప్రమాదకర ప్రాంతాలలోనే ఉంది.
ఇటీవల వరకు, నగరం ఒక మోస్తరు కాలుష్య స్థాయిల చుట్టూ ఉండేది, కానీ ఇప్పుడు ఊపిరితిత్తులను ఒత్తిడికి గురిచేసే, గుండె ఒత్తిడిని ప్రేరేపించే దీర్ఘకాలిక శ్వాసకోశ హానిని వేగవంతం చేసే పరిస్థితులను నగరవాసులు ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణుల హెచ్చరిస్తున్నారు.
నగరానికి చెందిన ప్రముఖ పల్మోనాలజిస్ట్ డాక్టర్ అరుణ రెడ్డి మాట్లాడుతూ, ‘అన్ని విధాల ఆరోగ్యకరమైన వ్యక్తులకు కూడా శ్వాస క్రియ ఇబ్బందిగా అనిపించే‘ దశలోకి నగరం ప్రవేశిస్తోందని అన్నారు. బయట తిరగడం, సరైన రక్షణ లేకుండా సంచరించడం ఇతర బహిరంగ కార్యకలాపాలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు తీవ్రమైన బాధ కలిగించేందుకు దారితీయవచ్చని ఆమె హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ శివార్లలో వాహనాల విస్త్రుతి, నిర్మాణ ధూళి, పారిశ్రామిక ఉద్గారాలు పంట అవశేషాలను కాల్చడం వల్ల ఈ పెరుగుదల సంభవిస్తోంది. ఉపరితలానికి దగ్గరగా కాలుష్య కారకాలను బంధించడం ద్వారా కాలానుగుణ వాతావరణ నమూనాలు ఆ ప్రభావాన్ని బలోపేతం చేశాయి. ఐఎండి శాస్త్రవేత్త శ్రీనివాసరావు మాట్లాడుతూ, పట్టణ ఉష్ణ–ద్వీప ప్రభావం వల్ల నగరంలో పెరుగుతున్న వేడి ‘భూస్థాయి ఓజోన్ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది ఇది మరో ప్రమాద పొరను జోడిస్తోంది’’ అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నివాసితులు బయట గడిపే సమయాన్ని తగ్గించుకోవాలని, బయటకు వచ్చేటప్పుడు మాస్క్‌లు ధరించాలని మరియు అటువంటి పరిస్థితులలో త్వరగా తీవ్రమయ్యే లక్షణాలను పర్యవేక్షించాలని అధికారులు సూచించారు.


