
బాలీవుడ్‌లో స్వీటెస్ కపుల్ అనగానే గుర్తొచ్చే జంట సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్. తాజాగా దీపావళి సందర్బంగా గుడ్ న్యూస్ చెప్పారు. ముంబైలోని తమ డ్రీమ్ హౌస్‌గురించి కొన్ని అద్భుతమైన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
ఇటీవల తన ప్రేమమందిరం గురించి యూట్యూబ్ వ్లాగ్‌లో పంచుకున్న సోనాక్షి, ఇక్భాల్ జంట అందమైన ఇల్లు కుటుంబ సభ్యులతోపాటు , దబాంగ్ బ్యూటీ ,భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి తన ముంబైలోని కొత్త ఇంటిని అభిమానులకు చూపించింది. కొన్ని స్టైలిష్, రొమాంటిక్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ఇవి అభిమానులకు ఆకట్టుకుంటున్నాయి.
కాగా ఈ జంట తమ వివాహానికి ముందే ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశామని, తన డ్రీమ్ హౌస్ పునరుద్ధరణ పనులు చేపట్టామని వెల్లడించింది. వంటగది ,లివింగ్ స్పేస్ గురించి వివరించారు ఇద్దరూ. ఈ సందర్బంగా ఇంటీరియర్ డిజైనర్ పాయల్ మక్వానా , గార్నెట్ కాంట్రాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు శుభ్రమైన, స్వచ్ఛమైన ప్లేస్‌ను ఊహించుకున్నానని సోనాక్షి అంటే, జహీర్ తనకు గట్టి ఫర్నిచర్ కావాలని "కాబట్టి ఎవరైనా దానిపై ఎప్పుడైనా నృత్యం చేయవచ్చు" అని చమత్కరించిన సంగతి తెలిసిందే.
సోనాక్షి అప్‌కమింగ్ యాక్షన్ చిత్రం "జటాధార" నవంబర్ 7న తెలుగు, హిందీ భాషలలో థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో సోనాక్షి ఇంతకు ముందెప్పుడూ చూడని, విలక్షణమైన కొత్త అవతారంలో సూపర్ నేచురల్ విలన్‌గా కనిపించనుంది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లో సుధీర్ బాబు, దివ్య ఖోస్లా , శిల్పా శిరోద్కర్ కూడా నటించారు.