
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డాలస్ (TPAD-టీపాడ్) ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతీ ఏడాదిలాగానే ఈసారి కూడా డే టైమ్‌లో స్థానిక కళాకారులు, స్టూడెంట్స్ తమ ప్రదర్శనలతో అదరగొట్టగా సాయంత్రం బతుకమ్మ, దసరా సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన సంగీతంతో షేక్ చేశారు. ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత స్పెషల్‌గెస్ట్‌గా హాజరైన ఈ వేడుకలో హీరోయిన్లు శివాని, అనన్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
దద్దరిల్లిన అల్లెన సెంటర్
టీపాడ్ వేడుకలకు వేదికైన డాలస్‌లోని అల్లెన ఈవెంట్ సెంటర్ దద్దరిల్లిపోయింది. ఈ మెగా ఈవెంటుకు తెలుగువారంతా భారీగా తరలి వచ్చారు. ఏటా పదిహేను వేల మందికి పైగా ఏర్పాట్లు చేస్తున్న టీపాడ్.. ఈసారి అంతకుమించి జనం వస్తారని ఊహించి అందుకు తగ్గట్టు సౌకర్యాలు సమకూర్చినా.. సుమారు రెండు వేల మంది మాత్రం కనీసం నిల్చుకునేందుకు స్థలం లేక వెనుదిరిగిపోయారు. ఉదయం 11 గంటలకే ప్రారంభమైన వేడుకలు రాత్రి 11 గంటలకు థమన మ్యూజిక్ కన్సర్ట్‌తో ముగిశాయి.
మహిషాసుర మర్ధిని నృత్యరూపకం
వేడుకల్లో భాగంగా తొలుత సుమారు 200 మంది స్థానిక కళాకారులు, విద్యార్థులు డ్యాన్సలు, సింగింగ్ టాలెంట్‌తో ఆహూతులను మెస్మరైజ్ చేశారు. రోజంతా సందడిగా సాగిన ఈ కార్యక్రమాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవన్న అనుభూతికి లోనయ్యేలా చేశారు. సాక్షాత్తూ అమ్మవార్లే కదిలివచ్చారా అన్నట్టు సాగిన 70 మంది సంప్రదాయ నృత్యకారులు ప్రదర్శించిన మహిషాసురమర్ధిని నృత్యరూపకం ప్రతి ఒక్కరిలో గూస్‌బంప్స్ తెప్పించాయి. డెబ్బయ్ మంది అడుగులు కాలిగజ్జెలతో నర్తిస్తుంటే స్టేడియం దద్దరిల్లిపోయింది. స్టేడియంలో ప్రతి ఒక్కరూ ఆ శబ్దానికి, నృత్యానికి పులకించి, కొత్తలోకంలో ఉన్నామా అన్న అనుభూతి కలిగింది. తెలంగాణ నేలపై నవరాత్రుల వైభవాన్ని చూడలేకపోయామే అనుకున్న వారికి ఈ వేడుక ఆ గ్యాప్‌ను భర్తీ చేసింది.

బతుకమ్మ ఆడిన హీరోయిన్లు
సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. హీరోయిన్లు శివాని, అనన్య మహిళలందరితో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహపరిచారు. బతుకమ్మలను నిమజ్జనం చేసిన అనంతరం శమీవృక్షానికి, అమ్మవారికి పూజలు నిర్వహించి దేవేరులను పల్లకిలో ఊరేగించారు. ఒకరికొకరు జమ్మి ఆకులను పంచుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. ఓవైపు హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించి గిన్నిస్‌రికార్డ్‌లో నమోదుచేయిస్తే.. ఇటు టీపాడ్ డాలస్‌లో దాదాపు అదే స్థాయిలో బతుకమ్మ పండుగను నిర్వహించి వేలాది మంది మహిళల మనసు దోచుకుంది.
కన్వెన్షనను తలపించిన ప్రాంగణం
రోజంతా మీడియా ప్రతినిధులతో పాటు ఇనఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల సందడి కనిపించింది. అల్లెన సెంటర్ ప్రాంగణంలలో నగలు, దుస్తులతో పాటు కన్వెన్షనను తలపించేలా అనేక వెండర్‌బూతలు వెలిశాయి. రకరకాల ఫుడ్‌కోర్టులు కొలువుదీరాయి.
జోష్ నింపిన థమన మ్యూజిక్
సంప్రదాయ వేడుకలన్నీ ముగిశాక థమన హైఓల్టేజీ ఎనర్జీ మ్యూజిక్ వెరీవెరీ స్పెషల్‌గా మారింది. ఆయన డ్రమ్స్ వాయిస్తుంటే ప్రతి ఒక్కరూ జోష్‌లో ఉండిపోయారు. డాలస్‌లోనే తన మొదటి కాన్సర్ట్ జరిగిందని చెప్పిన థమన.. మళ్లీ టీపాడ్ వేడుకపై ప్రదర్శన ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రోగ్రామ్‌లో సింగర్స్ పాడిన ఒక్కొక్క పాటకు స్టేడియంలో పలువురు స్టెప్పులేసి, చప్పట్లు కొట్టి హుషారు నింపారు. ఓజీ డైరెక్టర్ సుజిత ఈ వేదికపై అభిమానులనుద్దేశించి ప్రసంగించారు. ఈ మెగా ఈవెంట్‌ను ఫౌండేషన కమిటీ చెయిర్ రావు కల్వల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చెయిర్ పాండురంగారెడ్డి పాల్వాయి, ప్రెసిడెంట్ అనూరాధ మేకల, కోఆర్డినేటర్ రమణ లష్కర్, ఫౌండేషన కమిటీ సభ్యులు అజయ్‌రెడ్డి, జానకీరాం మందాడి, రఘువీర్ బండారు పర్యవేక్షించారు. వంద మంది వలంటీర్లు రెండు నెలలు శ్రమించి ఎక్కడా నిర్వహణ లోపాలు రాకుండా ఏర్పాట్లకు సహకరించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.