
ఒక చిన్న పొరపాటుతో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఇబ్బందులు పాలయ్యాడు. అమెరికాలోని బెంటన్‌లో తన అమెరికన్ భార్యతో నివసిస్తున్న కపిల్ రఘును పెర్ఫ్యూమ్ బాటిల్ కారణంగా అర్కాన్సాస్‌లో అరెస్ట్ చేశారు. వీసాను రద్దు చేశారు. దీంతో అతని దేశ బహిష్కరణ తప్పదేమో అనే ఆందోళనలో కుటుంబం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఫుడ్ డెలివరీ డ్రైవర్‌గా పనిచేసే రఘు అనే 32 ఏళ్ల వ్యక్తిని మే 3న బెంటన్ పోలీసులు చిన్న ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా చేసిన తనిఖీల్లో దొరికిన పెర్ఫ్యూమ్ బాటిల్ పెద్ద దుమారాన్నే రేపింది. రఘు కారు సెంటర్ కన్సోల్‌లో "ఓపియం" (నల్లమందు) అని రాసి ఉన్న పెర్ఫ్యూమ్ బాటిల్‌ను కనుగొన్నారు. అందులో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు అనుమానించారు. అది కేవలం పెర్ఫ్యూమ్ అని రఘు పదే పదే వివరణ ఇచ్చినా, పోలీసులు విశ్వసించలేదు. చివరికి రఘుని అరెస్టు చేశారు. అప్పటినుంచి అతనికి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. చట్టపరమైన, ఇమ్మిగ్రేషన్ సంక్షోభానికి దారితీసింది. వీసాను రద్దు చేయడంతో మరింత ఆందోళన నెలకొంది.
చదవండి: నో అన్న రెండేళ్లకే గూగుల్ ఇండియా కీలక బాధ్యతలు, ఎవరీ రాగిణీ?
మరోవైపు అర్కాన్సాస్ స్టేట్ క్రైమ్ ల్యాబ్ తదుపరి పరీక్షలో ఆ పదార్థం హానికరం కాదని , మాదకద్రవ్యాలు లేవని నిర్ధారించారు. అయినప్పటికీ, రఘు ఇప్పటికే మూడు రోజులు సెలైన్ కౌంటీ జైలులో గడిపాడు.మే 20న జిల్లా కోర్టు మాదకద్రవ్యాల కేసును కొట్టివేసిన తర్వాత ,ఈలోపు రఘు వీసా గడువు ముగిసిందంటూ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని, లూసియానాలోని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి తరలించి, 30 రోజుల పాటు నిర్బంధించారని రఘు న్యాయవాది మైక్ లాక్స్ వెల్లడించారు.
దీనిపై బాధితుడు రఘు తీవ్ర ఆందోళన వ్యక్తంచే శారు. తన భార్య యాష్లీ మేస్, మొత్తం భారాన్ని మోస్తోందని, కోర్టు ఖర్చులు, భరించడం కష్టం మారిందని వాపోయారు. ఈ జంటకు ఈ ఏప్రిల్‌లో వివాహం అయింది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) కార్యాలయానికి రాసిన లేఖలో, రఘు తన వీసాను తిరిగి పొందాలని విజ్ఞప్తి చేశాడు. కపిల్ రఘు విడుదల అయినప్పటికీ, @బహిష్కరణ' (deportation) స్టేటస్‌లో ఉంటాడని, మరింత ముఖ్యంగా, ఇది అతను పని చేయకుండా ,డబ్బు సంపాదించకుండా నిరోధిస్తుందని ఇది మరింత ఆందోళన కరమని న్యాయవాది వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే తన భర్తను నిర్దోషిగా బయటకొచ్చే క్రమలో అయ్యే ఖర్చుల కోసం భార్య ఆన్‌లైన్‌లో విరాళాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.
చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్‌లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్‌వీడియో