చైనాకు గూఢచర్యం?? .. భారత సంతతి అధికారి అరెస్ట్‌ | Secret Documents Row: Who Is Ashley Tellis Indian Origin US Defence Expert | Sakshi
Sakshi News home page

చైనాకు గూఢచర్యం?? .. అమెరికాలో భారత సంతతి అధికారి అరెస్ట్‌

Oct 15 2025 8:00 AM | Updated on Oct 15 2025 8:07 AM

Secret Documents Row: Who Is Ashley Tellis Indian Origin US Defence Expert

విదేశాంగ మంత్రి జైశంకర్‌(కుడి)తో ఆష్లీ జె టెలిస్(ఎడమ)

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ నిపుణుడు ఆష్లీ జె టెలిస్(Ashley Tellis) అరెస్ట్‌ అయ్యారు. అమెరికా రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక పత్రాలను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకుని అక్కడి అధికారులు విచారిస్తున్నారు. అదే సమయంలో.. చైనాకు గూఢచర్యం చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు జరుగుతుండడం గమనార్హం. 

Who Is Ashley Tellis.. ఆష్లీ జె టెలిస్ ముంబైలో జన్మించారు. బాంబే వర్సిటీ పరిధిలోని సెయింట్ జెవియర్స్ కాలేజీలో బీఏ, ఎంఏ చదివారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అక్కడే అమెరికాలోని పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక పదవుల్లో పని చేసి.. విదేశీ విధాన నిపుణుడిగా ఎదిగారు. ముఖ్యంగా.. 

అమెరికా విదేశాంగ శాఖలో సీనియర్ అడ్వైజర్‌గా పనిచేస్తూ.. అమెరికా-భారత్‌ అణు ఒప్పందంలో కీలక పాత్ర(US-India Civil Nuclear Agreement) పోషించారు. అంతేకాదు విదేశీ విధాన పరిశోధకుడిగా ఇరు దేశాల సంబంధాలపైనా ఆయన ఎన్నో రచనలు చేశారు. ప్రస్తుతం ఆయన కార్నెగీ ఎండౌమెంట్‌లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు. అయితే..

జాతీయ రక్షణ సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను ఆయన అనుమతి లేకుండా తన వెంట తీసుకెళ్లారనే అభియోగం నమోదైంది. 18 యూఎస్‌సీ సెక్షన్‌ 793(ఈ) ప్రకారం.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారంగా కేసు నమోదు అయింది. ప్రస్తుతం.. రహస్య ప్రాంతంలో టెలిస్‌ను విచారణ జరుపుతున్నారు. తూర్పు వర్జినీయా అటార్నీ ఆఫీస్‌ కార్యాలయం ఆయన అరెస్ట్‌, విచారణను ధృవీకరించింది.

ఫెడరల్‌ అధికారులు ఏమన్నారంటే.. 
64 ఏళ్ల వయసున్న టెలిస్‌.. దేశభద్రతకు సంబంధించిన గోప్యమైన పత్రాలను తన వెంట తీసుకెళ్లడం చట్ట ప్రకారం తీవ్ర నేరమే. తన సహ ఉద్యోగినిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్‌లు తనకివ్వమని ఆయన కోరారు. యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్‌ చేశారు. అలాగే.. చైనా అధికారులతోనూ ఆయన సమావేశమైనట్లూ ఆధారాలు ఉన్నాయి. 2022తో పాటు 2023 ఏప్రిల్‌ 11న బీజింగ్‌ అధికారులతో జరిగిన విందులోను పాల్గొన్నారు. ఈ మధ్యే చైనా అధికారులు ఆయనకు ఓ కాస్ట్‌లీ బ్యాగును కూడా గిఫ్ట్‌గా అందించారు అని అన్నారు. 

అయితే చైనా అధికారులతో భేటీ .. అకడమిక్‌కు సంబంధించినదని ఆయన అసిస్టెంట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి.. గూఢచర్యం ఆరోపణలు ఇప్పటికైతే నిర్ధారణ కాలేదు. అలాంటి అభియోగాన్ని నమోదు చేయలేదు. అయితే కీలక పత్రాలకు సంబంధించిన నేరం రుజువైతే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష,  $250,000(మన కరెన్సీలో రూ. 2 కోట్ల 21 లక్షల) జరిమానా విధించవచ్చు. కేసు విచారణ దశలో ఉన్నందున కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు దక్కే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఏఐ గురించి గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement