breaking news
Ashley tellis
-
చైనాకు గూఢచర్యం?? .. భారత సంతతి అధికారి అరెస్ట్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ నిపుణుడు ఆష్లీ జె టెలిస్(Ashley Tellis) అరెస్ట్ అయ్యారు. అమెరికా రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక పత్రాలను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకుని అక్కడి అధికారులు విచారిస్తున్నారు. అదే సమయంలో.. చైనాకు గూఢచర్యం చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు జరుగుతుండడం గమనార్హం. Who Is Ashley Tellis.. ఆష్లీ జె టెలిస్ ముంబైలో జన్మించారు. బాంబే వర్సిటీ పరిధిలోని సెయింట్ జెవియర్స్ కాలేజీలో బీఏ, ఎంఏ చదివారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పీహెచ్డీ పూర్తి చేశారు. అక్కడే అమెరికాలోని పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక పదవుల్లో పని చేసి.. విదేశీ విధాన నిపుణుడిగా ఎదిగారు. ముఖ్యంగా.. అమెరికా విదేశాంగ శాఖలో సీనియర్ అడ్వైజర్‌గా పనిచేస్తూ.. అమెరికా-భారత్ అణు ఒప్పందంలో కీలక పాత్ర(US-India Civil Nuclear Agreement) పోషించారు. అంతేకాదు విదేశీ విధాన పరిశోధకుడిగా ఇరు దేశాల సంబంధాలపైనా ఆయన ఎన్నో రచనలు చేశారు. ప్రస్తుతం ఆయన కార్నెగీ ఎండౌమెంట్లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు. అయితే..జాతీయ రక్షణ సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను ఆయన అనుమతి లేకుండా తన వెంట తీసుకెళ్లారనే అభియోగం నమోదైంది. 18 యూఎస్సీ సెక్షన్ 793(ఈ) ప్రకారం.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారంగా కేసు నమోదు అయింది. ప్రస్తుతం.. రహస్య ప్రాంతంలో టెలిస్ను విచారణ జరుపుతున్నారు. తూర్పు వర్జినీయా అటార్నీ ఆఫీస్ కార్యాలయం ఆయన అరెస్ట్, విచారణను ధృవీకరించింది.ఫెడరల్ అధికారులు ఏమన్నారంటే.. 64 ఏళ్ల వయసున్న టెలిస్.. దేశభద్రతకు సంబంధించిన గోప్యమైన పత్రాలను తన వెంట తీసుకెళ్లడం చట్ట ప్రకారం తీవ్ర నేరమే. తన సహ ఉద్యోగినిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్లు తనకివ్వమని ఆయన కోరారు. యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్ చేశారు. అలాగే.. చైనా అధికారులతోనూ ఆయన సమావేశమైనట్లూ ఆధారాలు ఉన్నాయి. 2022తో పాటు 2023 ఏప్రిల్ 11న బీజింగ్ అధికారులతో జరిగిన విందులోను పాల్గొన్నారు. ఈ మధ్యే చైనా అధికారులు ఆయనకు ఓ కాస్ట్లీ బ్యాగును కూడా గిఫ్ట్‌గా అందించారు అని అన్నారు. అయితే చైనా అధికారులతో భేటీ .. అకడమిక్‌కు సంబంధించినదని ఆయన అసిస్టెంట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి.. గూఢచర్యం ఆరోపణలు ఇప్పటికైతే నిర్ధారణ కాలేదు. అలాంటి అభియోగాన్ని నమోదు చేయలేదు. అయితే కీలక పత్రాలకు సంబంధించిన నేరం రుజువైతే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష, $250,000(మన కరెన్సీలో రూ. 2 కోట్ల 21 లక్షల) జరిమానా విధించవచ్చు. కేసు విచారణ దశలో ఉన్నందున కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు దక్కే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏఐ గురించి గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు -
‘పిలిచి ఉన్నపళంగా రాజీనామా చేయమన్నారు’
న్యూఢిల్లీ: బెంగళూరులో ఆంగ్ల సబ్జెక్టును బోధించే అసోసియేట్ ప్రొఫెసర్(స్వలింగ సంపర్కుడు)ను విధుల్లో నుంచి తప్పించారు. అతడి వల్ల విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలుగుతుందనే కారణంతో ఆయనను బలవంతంగా ఉద్యోగంలో నుంచి తీసివేశారు. ఈ విషయాన్ని ఆ ప్రొఫెసరే స్వయంగా చెప్పాడు. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ అనే కాలేజీ ఉంది. అందులో ఆంగ్ల విభాగంలో ఆష్లే టెలీస్ అనే వ్యక్తి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఓ స్వలింగ సంపర్కుడు. పైగా ఎల్జీబీటీ హక్కుల ఉద్యమకారుడిగా కూడా ఉన్నాడు. కొన్ని విషయాలతో అతడికి వ్యక్తిగతంగా భిన్నమైన అభిప్రాయాలుండేవి. వాటిని అతడు విద్యార్థులపై రుద్దుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని రాజీనామా చేయాలని కాలేజీ యాజమాన్యం ఆదేశించింది. ఈ విషయాన్ని అతడే తన మాటల్లో ఎలా చెప్పారంటే.. ‘మార్చి 9, 2017న నేను బీకామ్ సెకండియర్ విద్యార్థులకు పాఠం చెబుతున్నాను. ప్రిన్సిపాల్ పిలుస్తున్నారంటూ పాఠం మధ్యలోనే పిలిచారు. అక్కడికి వెళ్లాక పది నిమిషాలు ఎదురుచూడమన్నారు. ఆ తర్వాత పిలిచి ‘నీ వ్యక్తిగత అభిప్రాయాల కారణంగా విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలుగుతోంది. వెంటనే నీ బాధ్యతలకు రాజీనామా చేసి వెళ్లిపో.. ఇది ఇప్పుడే జరగాలి’ అని చెప్పారు. వాస్తవానికి విద్యార్థులు నిజంగానే డిస్ట్రబ్ అయితే.. అలా చేయడం కూడా బోధకుల పనే. అలా చేయలేకుంటే విద్యార్థులు ఎలా ఆలోచిస్తారు? ఎప్పుడు ఈ ప్రపంచం మారుతుంది? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన తన అనుభవాలను ఫేస్బుక్లో పంచుకున్నారు. -
భారత్‌లో అమెరికా రాయబారిగా టెల్లిస్?
వాషింగ్టన్: భారత్‌లో తదుపరి అమెరికా రాయబారిగా అష్లే టెల్లిస్ (55) నియమితులయ్యే వీలుంది. డొనాల్డ్ ట్రంప్.. ముంబైలో జన్మించిన టెల్లిస్‌కు భారత, ఆసియా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు తెలిసింది. వైట్‌హౌజ్ మాజీ ఉద్యోగి అయిన టెల్లిస్ భారత్, ఆసియా అంశాల్లో నిపుణుడు. దక్షిణముంబైలోని సెయింట్ గ్జేవియర్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, పీజీ పూర్తిచేశారు. ఆసియా రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ట్రంప్.. టెల్లిస్‌ను ఎంచుకున్నట్లు ఓ అమెరికన్ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం రిచర్డ్ వర్మ భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్నారు.