భారత్‌లో అమెరికా రాయబారిగా టెల్లిస్‌? | Ashley Tellis as US ambassador to India? | Sakshi
Sakshi News home page

భారత్‌లో అమెరికా రాయబారిగా టెల్లిస్‌?

Jan 11 2017 3:28 AM | Updated on Sep 5 2017 12:55 AM

భారత్‌లో అమెరికా రాయబారిగా టెల్లిస్‌?

భారత్‌లో అమెరికా రాయబారిగా టెల్లిస్‌?

భారత్‌లో తదుపరి అమెరికా రాయబారిగా అష్లే టెల్లిస్‌ (55) నియమితులయ్యే వీలుంది.

వాషింగ్టన్‌: భారత్‌లో తదుపరి అమెరికా రాయబారిగా అష్లే టెల్లిస్‌ (55) నియమితులయ్యే వీలుంది. డొనాల్డ్‌ ట్రంప్‌.. ముంబైలో జన్మించిన టెల్లిస్‌కు భారత, ఆసియా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు తెలిసింది. వైట్‌హౌజ్‌ మాజీ ఉద్యోగి అయిన టెల్లిస్‌ భారత్, ఆసియా అంశాల్లో నిపుణుడు. దక్షిణముంబైలోని సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, పీజీ పూర్తిచేశారు. ఆసియా రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ట్రంప్‌.. టెల్లిస్‌ను ఎంచుకున్నట్లు ఓ అమెరికన్‌ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం రిచర్డ్‌ వర్మ భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement