బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు విజయవంతం | Viksit Bharat Run Held in Brunei | Indian Embassy Organizes Grand Event Promoting Unity & Development | Sakshi
Sakshi News home page

బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు విజయవంతం

Oct 8 2025 12:01 PM | Updated on Oct 8 2025 12:44 PM

The Indian Embassy in Brunei organized the Vikasit Bharat Run

 భారత రాయబార కార్యాలయం  ఆధ్వర్యంలో బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు  విజయవంతం

భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పరుగును తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ సభ్యులు, భారతీయ ప్రవాసులు మరియు బ్రూనై పౌరులతో సహా 150 మందికిపైగా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.

వికసిత్ భారత్ 2047(Viksit Bharat@2047)దిశగా భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తమ అంకితభావాన్ని ప్రకటిస్తూ, పాల్గొన్నవారు ఐక్యతతో పరుగెత్తారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, సంఘీభావం, దేశభక్తిని అద్భుతంగా ప్రతిబింబించింది.


ఈ సందర్భంగా పాల్గొన్నవారిని ఉద్దేశించి భారత రాయబారి రాము అబ్బగాని అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు "దేశ అభివృద్ధి కోసం అవసరమైతే 16 గంటలపాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రూనై తెలుగు సంఘం సైతం సక్రియంగా పాల్గొనడం విశేషం.  భారత జాతీయ కార్యక్రమాల పట్ల తమ అంకితభావాన్ని ,ప్రవాస భారతీయుల ఐక్యతను చాటిచెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement