breaking news
Brunei country
-
బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు విజయవంతం
భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పరుగును తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ సభ్యులు, భారతీయ ప్రవాసులు మరియు బ్రూనై పౌరులతో సహా 150 మందికిపైగా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.వికసిత్ భారత్ 2047(Viksit Bharat@2047)దిశగా భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తమ అంకితభావాన్ని ప్రకటిస్తూ, పాల్గొన్నవారు ఐక్యతతో పరుగెత్తారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, సంఘీభావం, దేశభక్తిని అద్భుతంగా ప్రతిబింబించింది.ఈ సందర్భంగా పాల్గొన్నవారిని ఉద్దేశించి భారత రాయబారి రాము అబ్బగాని అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు "దేశ అభివృద్ధి కోసం అవసరమైతే 16 గంటలపాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రూనై తెలుగు సంఘం సైతం సక్రియంగా పాల్గొనడం విశేషం. భారత జాతీయ కార్యక్రమాల పట్ల తమ అంకితభావాన్ని ,ప్రవాస భారతీయుల ఐక్యతను చాటిచెప్పారు. -
బ్రూనైలో వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపుతారు
బెగావన్: వ్యభిచారానికి పాల్పడితే రాళ్లతో కొట్టి చంపడం.. ఇదేదో గిరిజన ప్రాంతాల్లో అనాగరికులు పాటిస్తున్న ఆచారమనుకుంటే పొరబాటే. బ్రూనై దేశంలో ఇప్పుడిది అధికారిక శిక్షల్లో ఒకటి. ఇలాంటి పలు కఠిన శిక్షలను మంగళవారం బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. జాతీయ స్థాయిలో ఇలాంటి నిర్ణయం తీసుకొన్న తొలి తూర్పు ఆసియా దేశం ఇదే. కొత్త షరియా పీనల్ కోడ్ మంగళవారమే ప్రవేశపెట్టామని, దీన్ని ఆరు నెలల్లో పలు దశలుగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. ముస్లింలకు మాత్రమే వర్తించే ఈ కొత్త పీనల్ కోడ్‌లో.. వ్యభిచారానికి పాల్పడితే రాళ్లతో కొటి చంపడం, దొంగతనానికి పాల్పడితే అంగం నరికేయడం, అబార్షన్ చేయించుకోవడం లేదా మద్యం తాగడం లాంటి ఉల్లంఘనలకు బెత్తంతో తీవ్రంగా దండించడం లాంటి శిక్షలు ఉన్నాయి. ‘‘అల్లా దయతో, ఈ చట్టం అమల్లోకి వచ్చాక, అల్లా పట్ల మా బాధ్యత నెరవేరుతుంది’’ అని సుల్తాన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కొత్త పీనల్ కోడ్‌పై హక్కుల సంఘాలు విరుచుకుపడుతున్నాయి.