
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అమెరికాలోని చికాగోలో ఘనంగా జరిగింది. వైఎస్ జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు.. అంబటి రాంబాబు కి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పరమ యరసాని, శరత్ యెట్టపు, నరసింహ రెడ్డి, కేకే రెడ్డి, KSN రెడ్డి, కందుల రాంభూపాల్ రెడ్డి, ఆర్వీ రెడ్డి , వెంకట్ రెడ్డి లింగారెడ్డి, హరినాథ్ పొట్టేటి , వినీల్ తోట తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ పరిపాలన గురించి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.
ఇక ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన వైస్సార్సీపీ అభిమానులు, సానుభూతిపరులు.. వైఎస్ జగన్ పై, అంబటి రాంబాబు పై వారి అచంచలమైన అభిమానాన్ని చాటారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. చికాగోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రవాసుల ప్రేమ చూస్తుంటే తనకు ముచ్చటేస్తుందన్నారు. దూర ప్రాంతాల నుంచి అమెరికాకు వచ్చినవారు వైఎస్ ఫ్యామిలీపై చూపిస్తున్న ప్రేమ మరువలేనిదన్నారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయ్యిందన్నారు. ఈ ఏడాదిన్నర పాలనలోనే ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకతను.. తన రాజకీయ జీవితంలోనే చూడలేదన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. పెద్ద పెద్ద ప్రకటనలు చేసి.. డప్పు కొట్టుకునే కార్యక్రమాలు చేశారు. సూపర్ సిక్స్ చేసేశాం అంటున్నారు. సూపర్ సిక్స్ లో ఏం అమలు చేశారో అర్దం కావటంలేదన్నారు అంబటి.
ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది వైఎస్సార్.. ఆ తర్వాత వైఎస్ జగనే అన్నారు. అమ్మ ఒడి పథకాన్ని దేశం మొత్తంలో మొదటగా ప్రవేశ పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. కానీ చంద్రబాబు ఆ పథకాలను కాపీ చేసి మేమే వీటిని సృష్టించాం అని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు అంబటి ఎంతో ఒపికగా సమాధనం ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
(చదవండి: AI వినియోగంపై హెచ్చరిక.. యూకేలో గరికపాటి ప్రవచనాలు)