ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) యూపీఐ చెల్లింపుల కోసం భారత్‌లో ప్రత్యేకంగా సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా తమ యాప్‌లో ప్రత్యేక ఫీచర్ అందుబాటులోకి తెచ్చినట్లు పేటీఎం తెలిపింది. దీనితో ఎన్నారైలు ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్లతోనే తమ యాప్‌లో లాగిన్ అయి, చెల్లింపులు జరపవచ్చని పేర్కొంది.
అమెరికా, ఆ్రస్టేలియా తదితర 12 దేశాల ఎన్నారైలకు ఈ సౌలభ్యం ఉంటుందని పేటీఎం పేర్కొంది. భారతీయ సిమ్ కార్డ్ లేకపోయినప్పటికీ ఎన్‌ఆర్‌ఈ లేదా ఎన్‌ఆర్‌వో ఖాతాలకు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్లతో పేటీఎం యాప్‌లో లాగిన్ అయి, తక్షణం నగదు బదిలీ చేయొచ్చని, వ్యాపారులకు చెల్లింపులు జరపవచ్చని వివరించింది. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో ఉందని, రాబోయే రోజుల్లో అర్హులైన యూజర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.
Hello NRIs 👋
You can now use your international mobile number on the Paytm app for UPI payments with your NRE or NRO account.
Send money home, pay at shops, or shop online on Indian apps and websites using Paytm UPI. Enjoy exclusive features like UPI statement download, spend… pic.twitter.com/o8SKQA8laA— Paytm (@Paytm) October 27, 2025


