
యూకేలోని లూటన్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు.. లూటన్ తెలుగు అసోసియేషన్ (ఎల్ టీ ఏ) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకున్నారు. బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు.
దాంతో అక్కడ దసరా వేడుక కనుల పండువలా సాగింది. బతుకమ్మలను పేర్చినవారందరికీ బహుమతులను అందజేశారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు.