సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు | Bathukamma 2025 grand celebrations in Singapore by TCSS | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు

Sep 29 2025 1:05 PM | Updated on Sep 29 2025 1:13 PM

Bathukamma 2025 grand celebrations in Singapore by TCSS

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)/TCSS ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు స్థానిక  సంబవాంగ్ పార్క్ లో సెప్టెంబర్  27, శనివారం రోజున  ఘనంగా జరిగాయి. భారతదేశం నుండి వచ్చిన స్థానికుల తల్లిదండ్రులు మరియు బంధువులు కూడా ఈ వేడుకలలో పాల్గొనడం విశేషం. 

 ఈ  సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది అతిథులు మరియు ఎన్నారైలు సుమారు 2500 నుండి 3000 వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలలో పాల్గొన్న అంతర్జాతీయ శ్రీ కృష్ణ మందిరం (ISKM), సింగపూర్ వారికి , వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ  (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గార్లకు TCSS సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, ఉపాధ్యక్షులు జూలూరి సంతోష్ కుమార్ మరియు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. 

సింగపూర్ లో నివసిస్తున్న తెలుగువారు  స్థానికులకు  బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ దశాబ్దానికి పైగా సింగపూర్ లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా బతుకమ్మ వైభవాన్ని చాటిచెప్పుతూ TCSS చరిత్రలో నిలిచిపోతుందని  సొసైటీ సభ్యులు అన్నారు. TCSS తో ప్రేరణ పొంది ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందించిన దాతలకు పేరు పేరున  ప్రతి ఒక్కరికి  టీసీఎస్‌ఎస్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. 

గత సంవత్సరాలతో పొలిస్తే ఈ ఏడాది ఆడపడుచులు బతుకమ్మలని పోటా పోటీగా చాలా అందంగా అలంకరించి వివిధ రూపాలలో 100 పైగా బతుకమ్మలని పేర్చి తీసుకొచ్చారు. బతుకమ్మని పేర్చి తెచ్చిన ప్రతి ఆడపడుచుని రెడ్ కార్పెట్ పై స్వాగతించి తనిష్క్ జ్యూవెల్లర్స్ వారి గిఫ్ట్ హాంపర్ని బహుమతిగా అందించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దాదాపు 11 బతుకమ్మలకు, ప్రత్యేక సాంప్రదాయ ఉత్తమ వస్త్రధారణలో ముస్తాబైన ముగ్గురు ఆడపడుచులకు వెండి వస్తువులు,చీరలు, తదితర ప్రత్యేక బహుమతులు అందజేశారు. 

ప్రతి యేడు లాగే ఈ సారి కూడా విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాట "సింగపూర్ చెక్కిలిపై సిరివెన్నెల కురిసేరా... పూలకే పూజ చేసే పండుగే మళ్ళొచ్చేరా" యూట్యూబ్ లో విడుదల చేసినప్పడినుండి వేల వీక్షణాలతో దూసుకుపోతుందని తెలిపారు. ఈ పాట మేకింగ్ కి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన స్థానిక ఏఐ పాల్స్ ప్రై. లి సంస్థకు  కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే ఈ వేడుకల్లో TCSS ప్రత్యేకంగా తయారు చేయించిన ఫోటోబూత్ , కృత్రిమబతుకమ్మ ఆకర్షణగా నిలిచాయి.

 ఈ వేడుకలను విజయవంతానికి సహకరించిన అందరికీ పేరు పేరునా నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.  ఈ వేడుకలకు కార్పొరేట్ స్పాన్సర్స్ కు, సహకరించిన మిత్రులకు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ  ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త  నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా,  భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు చల్ల కృష్ణ మొదలగు వారు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.  

సింగపూర్ లోని బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్ ,పుంగ్గోల్ , టాంపనీస్ ,బెడోక్ , మేల్విల్లీ పార్క్ మరియు సెరంగూన్ ప్రాంతాల నుండి బస్సులను నామ మాత్రపు రుసుముతో సమకూర్చి పండుగను విజయవంతగా నిర్వహించడం జరిగింది. సింగపూర్ వేడుకలను సొసైటీ  సోషల్‌మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అలాగే కమిటీ ఏర్పాటు చేసిన విందుభోజనాన్ని  ఆరగించి భక్తులందరూ సంతోషం ప్రకటించారు. 



వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బొందుగుల ఉమా రాణి ,నంగునూరు సౌజన్య, బసిక అనిత రెడ్డి, హేమ లత, దీప నల్ల, జూలూరు పద్మజ,కాసర్ల వందన, నడికట్ల కళ్యాణి, ఎర్రమ రెడ్డి దీప్తి, హరిత విజాపుర్, సౌజన్య మాదారపు, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సృజన వెంగళ,  హర్షిణి  మామిడాల, సుధా రాణి పెసరు, రావుల మేఘన, చల్ల లత   కీలక పాత్ర పోషించారు.

ఈ పండుగ వేడుకకు సహకరించిన పార్క్ యాజమాన్యానికి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బతుకమ్మలను మరియు సంప్రదాయ ఉత్తమ వస్త్రధారణలో ముస్తాబైన ఆడపడుచుల ఎంపికలో సహకరించిన మాధవి లాలంగర్, స్వప్న ముద్దం, సృజన బైస మరియు స్వప్నకైలాసపు, బతుకమ్మ ఆటకు కొరియోగ్రఫీగా సహకరించిన దీప రెడ్డి,  స్థానిక మీడియాకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాసర్ల శ్రీనివాస్, రవికృష్ణ విజాపుర్, ప్రవీణ్ కుమార్ సి హెచ్ మరియు సాత్విక నడికట్ల & సంజన బొందుగుల (జూనియర్ కమిటీ మెంబెర్స్) లు పండుగ వేడుకల వ్యాఖ్యాతలుగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement