
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం పాలయ్యారు(Telugu Man Dies in US Chicago). చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మరణించినట్లు సమాచారం. మృతుడిని హైదరాబాద్ చంచల్‌గూడకి చెందిన షెరాజ్ మెహతాబ్ మొహమ్మద్(25)గా గుర్తించారు.
ఆదివారం ఇల్లినాయిస్ ఈవెన్‌స్టన్ వద్ద జరిగిన ప్రమాదంలో షెరాజ్(Sheraz Chicago Road Accident) అక్కడిక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఈ వార్తతో హైదరాబాద్‌లోని అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఉన్నత స్థాయి అవకాశాల కోసం తమ కుమారుడు దేశంకాని దేశం వెళ్లి ఇలా మరణించడంటూ ఆయన తండ్రి అల్తాఫ్ మొహమ్మద్ చెబుతున్నారు. మృతదేహాన్ని ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే..
డల్లాస్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ పోలే అనే హైదరాబాదీ యువకుడు మరణించిన ఘటన తెలిసిందే. 48 గంటలు తిరకగ ముందే మరో నగరవాసి రోడ్డు ప్రమాదంలో మరణించడం అక్కడి భారతీయ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తోంది.