లండన్‌ పార్లమెంట్‌లో పద్మశ్రీ గరికపాటికి సన్మానం | Padma sree Garikapati Narasimha Rao honored in London by BITSS | Sakshi
Sakshi News home page

లండన్‌ పార్లమెంట్‌లో పద్మశ్రీ గరికపాటికి సన్మానం

Oct 18 2025 4:17 PM | Updated on Oct 18 2025 4:25 PM

Padma sree Garikapati Narasimha Rao honored in London by BITSS

తెలుగు సంస్కృతి సంఘం ఆధ్వర్యంలో బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ ఎంపీ వీరేంద్ర శర్మ, వలేరి వాజ్  బ్రహ్మ శ్రీ, పద్మశ్రీ గరికపాటి నరసింహ రావు గారికి సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పద్మశ్రీ గరికపాటి నరసింహ రావుభారతీయ రచనలు, పాశ్చాత్య సాహిత్యానికి ఉన్న సంబంధాన్ని, సారూప్యతలను చాలా చక్కగా వివరించారు. గరికపాటి గారు రచించిన ఒషెన్ బ్లూస్ సముద్రం గురించి,  ప్రముఖ రచయిత షేక్స్ పియర్  గురించి రాసిన కవితలు అద్భుతంగా వివరించారు.

భారతీయ రచనలు, మంగళ ప్రదంగా మొదలై, మంగళ ప్రదంగా నడుస్తూ, మంగళ ప్రదంగా ముగుస్తాయి అని అద్భుతంగా వివరించారు.పాశ్చాత్య రచనల్లో అతి ప్రముఖమైన షేక్స్ పియర్ రచనలైన హామ్లెట్ వంటి రచనల్లో పాత్రధారుల అన్ని కోణాలు ఆవిష్కరించబడతాయని వివరించారు. లండన్ లోని గ్లోబ్ థియేటర్ లో షేక్స్ పియర్ గారి నాటకాలు ఎంత విజయవంతంగా ప్రదర్శించబడ్డాయో  వివరించారు.

ఈ కార్యక్రమంలో బిట్స్ వ్యవస్థాపకులు సురేష్ మంగళగిరి ,సభ్యులు రాగసుధా ,యశ్వంత్ నూక గారు, అశ్విన్, వాస భరత్  వాస, హర్ష మైనేని, రాజ్ దేవరపు, శరత్ తమ, సుభాష్ రెడ్డి, షణ్ముఖ్, సుదర్శన్ రెడ్డి, రంజిత్, కాటిపల్లి సచిందర్ రెడ్డి, వివేక్, జయా తులసి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement