న్యూఢిల్లీ: బ్రిటన్‌లో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. హరియాణాలోని చర్కి దాద్రికి చెందిన విజయ్‌కుమార్ షియోరాన్(30) యూకేలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున వెర్సెస్టర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేసి పారిపోయారు. స్థానికులు విజయ్‌ను ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.
ఇండియాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్‌లో ఉద్యోగం చేసిన విజయ్ ఉన్నత విద్య కోసం ఈ ఏడాది ప్రారంభంలో యూకే వెళ్లాడు. బ్రిస్టల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో చదువుతున్నాడు. అతyì హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై బ్రిటిష్ పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. వీలైనంత త్వరగా తమ కుమారుడి మృతదేహాన్ని దేశానికి తీసుకురావాలని అతడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఘటనలో ఐదుగురు అనుమానితులను బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు.


