వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. | Wanaparthy Wife And Husband Incident | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

Nov 1 2025 12:13 PM | Updated on Nov 1 2025 12:13 PM

Wanaparthy Wife And Husband Incident

వనపర్తి జిల్లా: వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణ హత్య కేసు వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా భార్యే భర్త ప్రాణాలు తీసింది. జిల్లా కేంద్రంలో కురుమూర్తి, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. భార్య నాగమణి నందిమల్ల శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేత బంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, అతనిని హత్య చేయాలని పథకం వేసింది. అక్టోబరు 28న ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్‌తో కలిసి భర్త కురుమూర్తిని హత్య చేసింది.

అనంతరం  కారులో తీసుకెల్లి శ్రీశైలం వెళ్లి డ్యాంలో మృతదేహాన్ని పడేశారు. కురుమూర్తి సోదరి చెన్నమ్మ ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై వనపర్తి రెండో ఎస్సై శశిధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. రంగంలోకి దిగిన పోలీసులు, నాగమణి, శ్రీకాంత్లను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ దారుణ హత్య కేసు వనపర్తిలో సంచలనం రేపింది. భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement