
భారతీయ యువతిపై జాత్యహంకార దాడి
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఒక భారతీయ మహిళపై జాత్యహంకార దాడి సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న "గో బ్యాక్ టు ఇండియా" (Go Back To India) వేధింపులు, జాతి వివక్షకు అద్దం పట్టిన ఈ ఘటన సంచలనంగా మారింది. అక్టోబర్ 8న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో బాధితురాలు స్వాతి వర్మ మొత్తం సంఘటనవీడియోనుసోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకెదురైన చేదు అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న స్వాతి ఈఘటన తనను చాలా బాధపెట్టిందని, వ్యక్తిగతం ఇది కలవర పెట్టిందని విచారం వ్యక్తం చేసింది. జిమ్ నుంచి ఇంటికి నడిచి వెడుతుండగా గుర్తు తెలియని మహిళ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిందనీ, ఆధునిక సమాజంలో కూడా వలసదారులు వివక్ష, తిరస్కరణను ఎదుర్కొంటున్నారని ఈ వీడియోలో స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది.
సాయంత్రం 9 గంటల ప్రాంతంలో, తాను జిమ్ సెషన్ తర్వాత ఇంటికి వెళుతుండగా, నేను నివసించే ప్రదేశానికి కొన్ని అడుగుల దూరంలో, రోడ్డు అవతలి వైపున డబ్లిన్ సిటీ యూనివర్సిటీ (DCU) బ్యాడ్జ్ ధరించినఉన్న ఒక మహిళ ఈమెను సమీపించింది. ‘నువ్వు ఐర్లాండ్‌కు ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇండియా తిరిగి వెళ్లిపో’’ అంటూ నానా యాగీ చేసింది.
అంతేకాదు "నీకు వర్క్ వీసా ఉందా?" సొంత ఇల్లు ఉందా? అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడింది. అయితే తాను ఇక్కడ ఉచితంగా ఉండటం లేదనీ, టాక్స్‌లు కడుతూ ఇక్కడి దేశ ఆర్థిక వ్యవస్థకు తన వంతు సహకారం అందిస్తున్నాను అంటూ గట్టిగానే బదులిచ్చింది. అయినా సరే వెంటనే ఇండియాకు తిరిగి వెళ్లిపో అంటూ రెచ్చిపోయింది. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయానని భయంగా ఉందని, అసలేందో జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని స్వాతి పోస్ట్ చేసింది.
అయితే జాత్యహంకారం, బెదిరింపు , ద్వేషం ఇప్పటికీ మన వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. అందుకే తనలా ఎవరికీ జరగకూడదనే ఉద్దేశంతో దీన్ని రికార్డ్ చేసి, మీతో షేర్ చేసుకుంటున్నాని తెలిపింది. బహుశా ఆమె ఆమె మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉన్నట్టు లేదు.దయచేసి ఎవరైనా ఆమెకు హెల్ప్ చేయండి. అందుకే సం దీన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అని కూడా వివరించింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. స్వాతి ధైర్యాన్ని మెచ్చుకుంటూనే, జాగ్రత్తగా ఉండమని సూచించారు.