పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్‌తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు.
భారత్‌కు చెందిన అనిల్‌కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు.
తన పూర్తి పేరు అనిల్‌కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.
ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్‌కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్‌ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.
మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్‌కార్ కొనుగోలు చేసి.. సెవెన్‌స్టార్ హోటల్‌లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.
From anticipation to celebration, this is the reveal that changed everything!
Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆
For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.
A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025


