మెల్‌బోర్న్‌లో ఘనంగా వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు | YS Jagan grand birthday celebrations in Melbourne, Australia | Sakshi
Sakshi News home page

మెల్‌బోర్న్‌లో ఘనంగా వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు

Dec 25 2025 11:32 AM | Updated on Dec 25 2025 12:28 PM

YS Jagan grand birthday celebrations in Melbourne, Australia

వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆస్ట్రేలియాలోని వైఎస్సార్‌సీపీ మెల్‌బోర్న్‌ (ఎన్‌ఆర్‌ఐ విభాగం) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జూమ్ మీటింగులో పలువురు సీనియర్ పార్టీ నాయకులు సాకే శైలజానాథ్,ఆరే శ్యామల, చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొన్నారు. గత కొన్ని ఏళ్లుగా వైఎస్సార్‌సీపీ పార్టీకి, ఆ పార్టీ అధినేత జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆస్ట్రేలియా వైయస్సార్‌సీపీ ఎన్నారై లకి పార్టీ సీనియర్ నాయకులు  అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే ప్రోగ్రామ్‌లో సీనియర్ నాయకులని ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు చూపిస్తున్న ఆధారాభిమానాలకు పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందని అన్నారు నాయకులు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ జగన్ గారు తన పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేశారని తమలో చాలామంది వారి తండ్రి పెట్టిన పథకాలను ఉపయోగించుకుని వచ్చి విదేశాల్లో స్థిరపడ్డామని వారి రుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ మద్దతిచ్చి తీర్చుకుంటామని తెలియజేశారు.  

సాకే శైలజానాథ్, ఆరే శ్యామల, చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ..మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పార్టీకి ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. 

రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలాగా భరోసా ఉంటుందని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసీపీ నాయకులు నాగార్జున యలగాల, అనీల్ పెదగాడ, హరి చెన్నుపల్లి, శరత్ కుమార్ రెడ్డి తోట్లీ, విష్ణు వర్ధన్ రెడ్డి వాకమల్ల  తదితరులు పాల్గొన్నారు.

(చదవండి: అక్లాండ్‌లో ఘనంగా వైఎస్‌ జగన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement