NRI భాస్కర్ రెడ్డి అరెస్ట్ అప్‌డేట్స్...
విజయవాడ..
- విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎన్నారై భాస్కర్ రెడ్డి, అతని సోదరుడు ఓబుల్ రెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలు
- వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి కోర్టుకు తరలింపు
- కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో నడవలేని స్థితిలో భాస్కర్ రెడ్డి
- తనను పోలీసులు తీవ్రంగా కొట్టారంటున్న భాస్కర్ రెడ్డి
- సోషల్ మీడియా పోస్టుల కేసుతో పాటు భాస్కర్ రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు.
- సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టానని ఒప్పుకోవాలంటూ కోర్టు ప్రాంగణంలో భాస్కర్ రెడ్డిపై పోలీసుల ఒత్తిడి
- పోలీసుల బెదిరింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భాస్కర్ రెడ్డి
👉కూటమి ప్రభుత్వం ఎన్నారైలపై కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఎన్నారైలపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వేధింపులకు గురిచేస్తోంది. తాజాగా వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఓ ఎన్నారైను అక్రమంగా అరెస్ట్ చేసింది. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
👉వివరాల ప్రకారం.. మాలపాటి భాస్కర్ రెడ్డి లండన్‌లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. భాస్కర్ రెడ్డి స్వగ్రామం కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలోని చోడవరం. అయితే, భాస్కర్ రెడ్డి సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేసిన కూటమి సర్కార్ ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఈనెల ఒకటో తేదీన తన తండ్రి మరణంతో భాస్కర్ రెడ్డి.. లండన్ నుంచి స్వగ్రామం చోడవరం చేరుకున్నారు.
👉అనంతరం, వైద్య పరీక్షల కోసం తాడిగడపలోని కామినేని ఆసుపత్రికి భాస్కర్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు.. భాస్కర్ రెడ్డితో పాటు అతని సోదరుడు ఓబుల్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అయితే, ఏ కేసులో తనను అరెస్ట్ చేశారో.. ఎక్కడికి తీసుకువెళ్లారో అనే కనీస సమాచారం కూడా భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు పోలీసులు ఇవ్వలేదు. అరెస్ట్‌పై ప్రశ్నిస్తే పెనమలూరు పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. ఇక, తాజాగా వారిద్దరినీ వైద్య పరీక్ష నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తీసుకువచ్చారు.


