
ఈస్ట్ విండ్‌సర్, న్యూజెర్సీ: భావితరంలో సామాజిక బాధ్యత పెంచేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా న్యూజెర్సీలో హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టి హైవేను శుభ్రం చేసింది. ఈస్ట్ విండ్‌సర్, న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో అడాప్ట్-ఎ-హైవే క్లీన్ అప్ ప్రోగ్రామ్ పేరుతో నాట్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ సభ్యులు, పలువురు తెలుగు విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రహదారి పరిసరాలను శుభ్రం చేశారు. ఇలా తెలుగు విద్యార్థులు నాట్స్ ద్వారా చేసిన ఈ సామాజిక సేవకు అమెరికా ప్రభుత్వం నుంచి వాలంటీర్ అవర్స్‌గా గుర్తిస్తుంది.. ఇది విద్యార్థుల కాలేజీ ప్రవేశాలకు ఉపకరిస్తుంది. నాట్స్ న్యూజెర్సీ నాయకులు ప్రశాంత్ కూచు నాయకత్వంలో కిరణ్ మందాడి, సుఖేష్ సుబ్బాని, రాజేష్ బేతపూడి తదితరులు హైవే దత్తత పరిశుభ్రత కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

తెలుగు వాళ్లు అమెరికా సమాజానికి సేవ చేయగలగడం పట్ల సంతోషంగా ఉందని నాట్స్ అధ్యక్షుడు శ్రీ హరి మందాడి అన్నారు. శుభ్రమైన, పచ్చని వాతావరణం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ పని గంటలు విద్యార్థులకు
తమ వాలంటీర్ అవర్స్‌గా పాఠశాలలో ఉపయోగపడతాయన్నారు. ఇకపై ప్రతీ రెండు నెలలకొకసారి ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని తెలుగు విద్యార్ధులు చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

నాట్స్ న్యూజెర్సీ బృందం నుంచి శ్రీనివాసరావు భీమినేని, కిరణ్ మందాడి, శ్రీనివాస్ మెంట, వంశీ వెనిగళ్ల, ప్రశాంత్ కుచ్చు, సుఖేష్ సుబ్బాని, రాజేష్ బేతపూడి, శ్రీనివాస్ నీలం, సూర్య గుత్తికొండ, శంకర్ జెర్రిపోతుల, మల్లి తెల్ల, వెంకట్ గోనుగుంట్ల తదితరులు ఈ హైవే దత్తత, పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంచే చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన న్యూజెర్సీ నాట్స్ టీమ్‌ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.