
మలేషియా (malaysia) రాజధాని నగరం కౌలాలంపూర్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా శనివారం జరిగాయి. తెలంగాణా ఆడబిడ్డల గౌరవ ప్రతీక, ప్రకృతి పండుగ, బతుకమ్మలను వివిధ రకాల పూలతో అలంకరించారు. తెలుగు మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై, బతుకమ్మ ఆటపాటలతో సందడిగా గడిపారు. చిన్నా పెద్దా అంతా ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం ప్రసాదాలను ఒకరికొకరు పంచుకొని గౌరమ్మను నిమజ్జనం చేశారు.



కౌలాలంపూర్‌లోని బ్రిక్స్‌ఫీల్డ్స్‌లోలోని కృష్ణా టెంపుల్‌లో ఈ వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఎన్‌ఆర్‌ఐ కల్చరల్ అసోసియేషన్ మలేషియా (Federation of nri cultural association malaysia) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు డిప్యూటీ హైకమీషనర్ సుభాషిణి నారాయణన్, పెరెక్ స్టేట్ లెజిస్లేటివ్ సభ్యురాలు శాంతి చిన్నసామిముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రతీ ఏడాది బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోవడం తమకు ఆనవాయితీ అని నిర్వాహకులు తెలిపారు.