తెలుగువారు ఏ దేశంలో ఉన్న వారి సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పడంలో ఎపుడు ముందుంటారు. అందుకు నిదర్శనం జపాన్‌లో టోక్యో నగరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (తాజ్) అధ్వర్యంలో జరిగిన కార్తీక మాసం వనభోజనాలు. నవంబర్ 8న ఈ వేడుక స్థానిక కొమట్సుగవ పార్కులో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు అందరు పాల్గొని ఆట పాటలతో సరదాగా గడిపారు. ఒక్కో కుటుంబం నుంచి ఒక్క తినుబండారం తెచ్చి వనభోజన కార్యక్రమం నిర్వహించడం విశేషం. ప్రతి ఏటా ఇలాగే వేడుక జరుపుకోవాలని వారంతా ఆకాంక్షించారు.

(చదవండి: ఆటా, ఎస్‌ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్)


