టీడీపీది రాక్షసానందం.. జగనన్న మాకు ధైర్యం చెప్పారు | Ambati Rambabu Younger Daughter Expresses Anger Over Attack By TDP Leaders And Comments On YS Jagan, More Details | Sakshi
Sakshi News home page

టీడీపీది రాక్షసానందం.. జగనన్న మాకు ధైర్యం చెప్పారు

Feb 5 2026 1:33 PM | Updated on Feb 5 2026 2:47 PM

Ambati Younger Daughter Expresses Anger Over Attack By Tdp Leaders

సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల దాడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శ్రీజ.. జగనన్న తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని.. మా తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ‘‘టీడీపీ వాళ్లు మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. కానీ నిన్న వేలమంది అభిమానంతో మా ఇంటికి వచ్చారు. మా నాన్న చెప్పినట్టే మాకు అండగా వెంకటేశ్వరస్వామి ఉన్నారు’’ అని శ్రీజ పేర్కొన్నారు.

‘‘దేవుడి అండ ఉన్నంతవరకు మాపై వేసే ప్రతీ రాయి పువ్వుగా మారుతుంది. ఆయనే మాకు ఓ రక్షణ కవచంలా ఉంటారు. మా ఇంటిపై అత్యంత దారుణంగా అటాక్ చేశారు. 9 గంటల పాటు తండోపతండాలుగా జనం దాడి చేశారు. ఉదయం గుడికి వెళ్లిన నాన్నపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేశారు. టీడీపీ మహిళలు బూతులతో ఆయనను తిట్టారు. ఆ సమయంలోనే మా నాన్న అలా మాట్లాడారు. దానికి ఆయన రియలైజ్ అయ్యి ఆ మాట అనకూడదన్నారు. లీగల్‌గా ఎదుర్కొంటానని కూడా చెప్పారు

..కానీ మా ఇంట్లో ఆడవాళ్లని దారుణంగా తిడుతూ అటాక్ చేశారు. కాపు కులంకి బూతులు జోడించి తిట్టారు. ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి దీనిని నడిపించడం దారుణం. ఆయన మేథస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోంది. అంబటి రాంబాబుని నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం దారుణం. ఆయనను వేధించి రాక్షసానందం పొందారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలుసుకొవాలి. దాడి చేసిన దానికంటే.. నాలుగు రెట్ల జనం అభిమానంతో వచ్చారు’’ అని శ్రీజ చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement