breaking news
younger daughter
-
టీడీపీది రాక్షసానందం.. జగనన్న మాకు ధైర్యం చెప్పారు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల దాడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శ్రీజ.. జగనన్న తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని.. మా తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ‘‘టీడీపీ వాళ్లు మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. కానీ నిన్న వేలమంది అభిమానంతో మా ఇంటికి వచ్చారు. మా నాన్న చెప్పినట్టే మాకు అండగా వెంకటేశ్వరస్వామి ఉన్నారు’’ అని శ్రీజ పేర్కొన్నారు.‘‘దేవుడి అండ ఉన్నంతవరకు మాపై వేసే ప్రతీ రాయి పువ్వుగా మారుతుంది. ఆయనే మాకు ఓ రక్షణ కవచంలా ఉంటారు. మా ఇంటిపై అత్యంత దారుణంగా అటాక్ చేశారు. 9 గంటల పాటు తండోపతండాలుగా జనం దాడి చేశారు. ఉదయం గుడికి వెళ్లిన నాన్నపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేశారు. టీడీపీ మహిళలు బూతులతో ఆయనను తిట్టారు. ఆ సమయంలోనే మా నాన్న అలా మాట్లాడారు. దానికి ఆయన రియలైజ్ అయ్యి ఆ మాట అనకూడదన్నారు. లీగల్‌గా ఎదుర్కొంటానని కూడా చెప్పారు..కానీ మా ఇంట్లో ఆడవాళ్లని దారుణంగా తిడుతూ అటాక్ చేశారు. కాపు కులంకి బూతులు జోడించి తిట్టారు. ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి దీనిని నడిపించడం దారుణం. ఆయన మేథస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోంది. అంబటి రాంబాబుని నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం దారుణం. ఆయనను వేధించి రాక్షసానందం పొందారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలుసుకొవాలి. దాడి చేసిన దానికంటే.. నాలుగు రెట్ల జనం అభిమానంతో వచ్చారు’’ అని శ్రీజ చెప్పారు. -
బాలీవుడ్ హీరోయిన్ కూతురి పెళ్లి!
ముంబై: 1990 ల్లో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రవీనా టాండన్ చిన్న కూతురికి పెళ్లి చేస్తోంది.. రవీనా కూతురి పెళ్లా? ఆమెకు అంత పెద్ద పిల్లలున్నారా? అని అలా షాక్ అవ్వకండి..! రవీనా తన దత్త కుమార్తె పెళ్లి చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. నా చిన్న కూతురు పెళ్లి గోవాలో.. ఆ హడావుడిలో ఉన్నా.. ఈ వారమంతా అదే సందడి... అంటూ ట్విట్ చేసింది. కెరీర్ పీక్ స్టేజ్ లోఉన్నపుడు ఈ అమ్మడు ఇద్దరు అమ్మాయిలను దత్తతకు తీసుకుని ఆదర్శంగా నిలిచింది. 2011లో పెద్ద కుమార్తె పూజ వివాహం చేసిన రవీనా ఇపుడు రెండో అమ్మాయి చోయా టాండన్ పెళ్లిని ఘనంగా నిర్వహిస్తోంది.. ఈ నెల 25న హిందూ- కేథలిక్ పద్ధతిలో గోవాలో ఈ పెళ్లివేడుక జరగనున్నట్టు సమాచారం. కాగా పెళ్లికి ముందే ఇద్దరు ఆడపిల్లలను దత్తత చేసుకున్న రవీనా . అనంతరం పది సంవత్సరాలకు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడ ను వివాహమాడింది. వీరికి రేష, రణ్‌బీర్ అనే ఇద్దరు పిల్లలున్నారు. తెలుగులో దాదాపు టాప్ హీరోలతోనూ జతకట్టింది. బాలకృష్ణతో 'బంగారు బుల్లోడు', మోహన్‌బాబుతో పాండవులు పాండవులు తుమ్మెద, నాగార్జునతో ఆకాశ వీధిలో.. తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.


