బాలీవుడ్ హీరోయిన్ కూతురి పెళ్లి! | Raveena Tandon’s younger daughter to tie the knot on Jan 25 | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ హీరోయిన్ కూతురి పెళ్లి!

Jan 23 2016 11:49 AM | Updated on Sep 3 2017 4:10 PM

బాలీవుడ్ హీరోయిన్ కూతురి పెళ్లి!

బాలీవుడ్ హీరోయిన్ కూతురి పెళ్లి!

90వ దశంలో బాలీవుడో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన రవీనా టాండన్ చిన్న కూతురికి పెళ్లి చేస్తోంది.

ముంబై: 1990 ల్లో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రవీనా టాండన్  చిన్న కూతురికి  పెళ్లి చేస్తోంది..  ర‌వీనా కూతురి పెళ్లా? ఆమెకు అంత పెద్ద పిల్లలున్నారా?  అని అలా  షాక్ అవ్వకండి..!  రవీనా తన దత్త కుమార్తె పెళ్లి చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా  ఆమె అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నారు.   నా చిన్న కూతురు పెళ్లి గోవాలో.. ఆ హడావుడిలో ఉన్నా.. ఈ వారమంతా అదే సందడి... అంటూ ట్విట్ చేసింది.

 కెరీర్ పీక్ స్టేజ్ లోఉన్నపుడు ఈ అమ్మడు ఇద్దరు అమ్మాయిలను దత్తతకు తీసుకుని  ఆదర్శంగా నిలిచింది. 2011లో పెద్ద  కుమార్తె పూజ  వివాహం చేసిన రవీనా ఇపుడు  రెండో అమ్మాయి చోయా టాండ‌న్  పెళ్లిని ఘనంగా  నిర్వహిస్తోంది.. ఈ నెల 25న  హిందూ- కేథ‌లిక్  పద్ధతిలో గోవాలో ఈ పెళ్లివేడుక జరగనున్నట్టు సమాచారం.


కాగా పెళ్లికి ముందే ఇద్దరు ఆడపిల్లలను  దత్తత చేసుకున్న రవీనా . అనంతరం పది సంవత్సరాలకు  ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్‌ అనిల్ త‌డ ను వివాహమాడింది.  వీరికి  రేష‌, ర‌ణ్‌బీర్  అనే  ఇద్దరు పిల్లలున్నారు. తెలుగులో  దాదాపు టాప్ హీరోలతోనూ జతకట్టింది.  బాలకృష్ణతో 'బంగారు బుల్లోడు', మోహ‌న్‌బాబుతో పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద, నాగార్జునతో ఆకాశ వీధిలో..  తదితర సినిమాలతో తెలుగు  ప్రేక్షకులను అలరించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement