
ఇటీవలి కాలంలో వరుస ఎన్‌ఆర్‌ఐల మరణాలు ఆందోళన రేపుతున్నాయి. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో తన భార్య , కుమారుడికి వీడ్కోలు పలికిన కొన్ని గంటలకే UAEలో ఒక భారతీయ ప్రవాస ఇంజనీర్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుడిని హరిరాజ్ సుదేవన్ (37) (Hariraj Sudevan) గుర్తించారు.
కేరళలోని అలప్పు జిల్లాకు చెందిన 37 ఏళ్ల హరిరాజ్ సుదేవన్ హరిరాజ్ సుదేవన్ గత 12 ఏళ్లుగా యుఎఇలో నివసిస్తున్నాడు. అయితే తన భార్య డాక్టర్ అను అశోక్ , 10 ఏళ్ల కుమారుడు ఇషాన్ దేవ్ హరి కేరళ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారిని విమానాశ్రయంలో దింపిన కొన్ని గంటలకే అబుదాబిలో గుండెపోటుతో మరణించాడు. అల్లుడు అకాల మరణంపై మామ అశోకన్ కేపీ తీవ్ర విచారాన్ని ప్రకటించారు. ఆయన ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామనంటూ కంట తడిపెట్టారు.

ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే ముందు తన కుమార్తె , మనవడు హరిరాజ్‌తో 10 రోజులు గడిపారని, అక్టోబర్ 27న తన కొడుకు పుట్టినరోజుకు హాజరు కావడానికి హరిరాజ్ ఈ నెల చివర్లో రావాల్సి ఉందని గుర్తు చేసుకున్నారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన సుదేవన్, యుఎఇలో 12 సంవత్సరాలకు పైగా సీనియర్ ఆఫ్‌షోర్ కన్‌స్ట్రక్షన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కుసాట్ నుండి బి.టెక్ ,ఐఐటీ మద్రాస్ నుండి ఎంటెక్ పట్టా పొందారు. హరిరాజ్, అబుదాబిలో సీనియర్ పనిచేస్తున్నారు. అంత్యక్రియల కోసం ఆయన మృతదేహాన్ని కేరళకు తరలించారు. థామస్ కుమార్తె పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి మా ఇంటికి వచ్చారని, ఎంతో సంతోషంగా గడిపామని సన్నిహిత స్నేహితుడు డిజిన్ థామస్ తెలిపారు.