
పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుని ఇండియాకు వచ్చిన భారతసంతతికి చెందిన US పౌరురాలు అనూహ్యంగా కన్నుమూసిన ఘటన కలకలం సృష్టించింది. జూలైలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళ మిస్సింగ్ కేసు నమోదైన తరువాత షాకింగ్ విషయాలను పోలీసులు ప్రకటించారు.
పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్‌లోని లుధియానా జిల్లాలో అమెరికన్ పౌరురాలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోఇండియాకు వచ్చింది. లూధియానాకు చెందిన ఇంగ్లాండ్‌కు చెందిన నాన్-రెసిడెన్షియల్ ఇండియన్ (NRI) చరణ్‌జిత్ సింగ్ గ్రెవాల్ (75)ను వివాహం చేసుకోవాలని భావించింది. అతని ఆహ్వానం మేరకు రూపిందర్ కౌర్ పాంధేర్ (71) భారతదేశానికి వచ్చారు. అయితే సియాటిల్ నుండి ఇండియాకు వచ్చిన కొద్దిసేపటికే ఏళ్ల మహిళ హత్యకు గురైంది. అయితే ఫోన్లకు స్పందించకపోవడం, ఫోన్ స్విచ్‌ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన పాంధేర్ సోదరి కమల్ కౌర్ ఖైరా తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో జూలై 28న న్యూఢిల్లీలోని అమెరికిఆ రాయబార కార్యాలయానికి సంప్రదించారు. ఎంబసీ ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గ్రెవాల్ ఆమెను కిరాయి హంతకులతో హత్య చేయించాడని తేల్చారు. ఆర్థికపరమైన కారణాల వల్లే ఈ హత్య జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు గ్రేవాల్‌తో పెళ్లికి ముందు అతనికి పెద్దమొత్తంలో డబ్బును బదిలీ చేసినట్టు కూడా గుర్తించారు.
రూపిందర్ అమెరికా పౌరురాలు. యూకేలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ చార్జిత్ సింగ్ గ్రెవాల్‌తో పెళ్లికోసం ఇండియాకు వచ్చింది. అయితే ఆమెను తుదముట్టించాలని పథకం వేసుకున్న గ్రెవాల్ కాంట్రాక్ట్ కిల్లర్ సుఖ్‌జీత్ సింగ్ సోనూతో రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆమెను కిరాతంగా హత్య చేయించాడు. అయితే ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే సమయంలోనే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశాడని సోనూ దెహ్లోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానీ అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని అంగీకరించాడు. తన నివాసంలోని స్టోర్‌రూమ్‌లో రూపిందర్ శరీరాన్ని కాల్చి, బూడిద చేసి లెహ్రా గ్రామంలోని కాలవలో పారవేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఈ మేరకు సంఘటనా స్థలంలో మృతరాలి ఎముకలను స్వాధీనం చేసుకొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) హర్జిందర్ సింగ్ గిల్ , స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్‌ఓ) సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును విచారణ సాగుతోంది. పరారీలో ఉన్నగ్రెవాల్‌తో పాటు, అతడి సోదరుడిపై కేసు నమోదు చేశారు. సోను వెల్లడించిన దాని ఆధారంగా బాధితురాలి అస్థిపంజర అవశేషాలు, ఇతర ఆధారాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు పోలీసులు ఈ ఘటన ఇటు భారత్‌తోపాటు, అటు అమెరికా, యూకే ఎన్‌ఆర్‌ఐ వర్గాల్లో ఆందోళన రేపుతోంది.