బోస్టన్ గ్లోబల్ ఫోరం (The Boston Global Forum (BGF) , AI వరల్డ్ సొసైటీ (AIWS) నుంచి 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును శ్రీ శ్రీ రవిశంకర్ ప్రదానం చేశారు.. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన, వివాదాల పరిష్కారం, మానవతా సేవలలో ఆయన చేసిన అసామాన్య సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథుల సమక్షంలో జరిగింది.
గత సంవత్సరం ఈ అవార్డు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్‌కు యూరప్ లోను , ప్రపంచవ్యాప్తం గాను శాంతి మరియు భద్రతను ప్రోత్సహించే దిశగా చేసిన నాయకత్వ కృషికి గుర్తింపుగా ప్రదానం చేశారు.


ఇంతకుముందు ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నవారు:
జర్మనీ ఛాన్సలర్ ఆంగెలా మెర్కెల్
ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్
జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే
ఫిన్‌లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టో
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్‌స్కీ ఉక్రెయిన్ ప్రజలతో
ఈ అవార్డు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే అత్యున్నత గ్లోబల్ నాయకులకు అందించే అరుదైన గౌరవాల్లో ఒకటి.



