కెనడాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు | Telangana Bathukamma festival celebration in Canada | Sakshi
Sakshi News home page

కెనడాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Sep 29 2025 7:26 PM | Updated on Sep 29 2025 7:47 PM

Telangana Bathukamma festival celebration in Canada

ఒట్టావా: తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ (TDF), కెనడా ఆధ్వర్యంలో బ్రాంప్టన్ నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.  భారీ సంఖ్యలో NRI లు కుటుంబ సమేతంగా హాజరై ఆట, పాటలతో బతుకమ్మ పండుగ ను జరుపుకున్నారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్,కెనడా నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేసి, పసందైన తెలంగాణా వంటకాలతో భోజనాలు కూడా ఏర్పాటు చేసారు. కెనడాలోనే పుట్టిపెరిగిన తెలుగు పిల్లలు మన పండగల ప్రత్యేకత తెలుసుకోవటం ఇలాంటి కార్యక్రమాలతో సాధ్యమౌతుందని టీడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీఫ్ కెనడా ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ సురేందర్ పెద్ది,  అమితా రెడ్డి, టీడీఫ్ కెనడా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గంటా రెడ్డి మాణిక్ రెడ్డి స్మారక విశేష సేవా పురస్కారాన్ని మహేష్ మాదాడి, రజిని దంపతులకు టీడీఫ్ కెనడా కమిటీ తరపున అందజేశారు. 21 సంవత్సరాల నుండి  కెనడాలో  బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి తోడ్పాడుతున్న ప్రతీ ఒక్కరికి టీడీఎఫ్ కెనడా కమిటీ ధన్యవాదములతో అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement