ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా భారత్ సంతతికి చెందిన ఓ వ్యక్తి.. కెనడాలో మరణించడంపై టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో స్పందించారు. కెనడా ప్రభుత్వంపై తన ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. భారత సంతతికి చెందిన ప్రశాంత్ కుమార్(44) కెనడాలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, ఈ నెల 22వ తేదీన ప్రశాంత్ కుమార్‌కు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో ఎడ్మంటన్‌లోని గ్రే నన్స్ కమ్యూనిటీ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు.
మధ్యాహ్నం 12.20 గంటల నుంచి రాత్రి 8.50 గంటల వరకు చికిత్స అందించకుండా వెయింట్ చేయించారు. ఛాతీనొప్పి ఎక్కువగా ఉందని ఆస్పత్రి సిబ్బందిని బతిమాలినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బీపీ 210కి పెరిగినా కూడా ఆయకు టైలెనాల్ మాత్రమే ఇచ్చారు. వెయిటింగ్ హాల్‌లో 8 గంటలు ఉంచిన తర్వాత చికిత్స ప్రారంభించారు. కొన్ని నిమిషాల్లోనే ప్రశాంత్ కుమార్ కుప్పకూలి మృతిచెందారు.
కెనడా ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎలాన్ మాస్క్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తే, అది DMV(డిపార్ట్‌మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్) లాగే ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. కెనడా ఆరోగ్య వ్యవస్థను US మోటారు వాహన విభాగంతో పోల్చుతూ మస్క్ విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. కెనడా ప్రభుత్వానికి లేఖ రాసింది. అతడి మృతికి కెనడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
When the government does medical care, it is about as good as the DMV https://t.co/kRdlL3idyF
— Elon Musk (@elonmusk) December 26, 2025


