మలేషియాలో దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు | Dussehra Bathukamma Diwali Celebrations in Malaysia | Sakshi
Sakshi News home page

మలేషియాలో దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు

Oct 5 2025 4:46 PM | Updated on Oct 5 2025 5:20 PM

Dussehra Bathukamma Diwali Celebrations in Malaysia

కౌలాలంపూర్, అక్టోబర్ 4:
భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (BAM) ఆధ్వర్యంలో, మలేషియాలోని అన్ని భారతీయ సమాజాలు కలసి ఘనంగా “దసరా • బతుకమ్మ • దీపావళి 2025” మహోత్సవాన్ని టానియా బ్యాంక్వెట్ హాల్, బ్రిక్ఫీల్డ్స్ లో నిర్వహించాయి.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ గారు లోక్‌సభ సభ్యుడు, హాజరై ఆశీస్సులు అందించారు. అలాగే భారత హైకమిషనర్ మరియు మలేషియా ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొని వేడుకకు విశిష్టతను తీసుకువచ్చారు.

 
అతిథులు మాట్లాడుతూ – “ఈ వేడుక తెలుగు వారికే పరిమితం కాకుండా భారత దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతి భారతీయుడు ఐక్యంగా జరుపుకున్న ఒక గొప్ప సాంస్కృతిక మహోత్సవం. నిజంగా కన్నుల పండుగగా నిలిచింది” అని అభినందించారు.

సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పాటలు, పండుగ ప్రత్యేకతలతో కూడిన కార్య‌క్ర‌మాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకలో మలేషియాలో నివసిస్తున్న అన్ని భారతీయ NRIలు విశేషంగా పాల్గొని BAM మహోత్సవాన్ని విజయవంతం చేశారు.

BAM ప్రధాన కమిటీ సభ్యులు
* చోప్పరి సత్య – అధ్యక్షుడు
* భాను ముత్తినేని – ఉపాధ్యక్షుడు
* రవితేజ శ్రీదశ్యం – ప్రధాన కార్యదర్శి, IT మరియు PR కమ్యూనికేషన్
* రుద్రాక్షల సునీల్ కుమార్ –కోశాధికారి 
* గజ్జడ శ్రీకాంత్ – సంయుక్తకోశాధికారి 
* రుద్రాక్షల రవికిరణ్ కుమార్ – యువజన నాయకుడు
* గీత హజారే – మహిళా సాధికారత నాయకురాలు
* సోప్పరి నవీన్ – కార్యవర్గ సభ్యుడు
* యెనుముల వెంకట సాయి – కార్యవర్గ సభ్యుడు
* అపర్ణ ఉగంధర్ – కార్యవర్గ సభ్యుడు
* సైచరణి కొండ – కార్యవర్గ సభ్యుడు
* రహిత – కార్యవర్గ సభ్యుడు
* సోప్పరి రాజేష్ – కార్యవర్గ సభ్యుడు
* పలకలూరి నాగరాజు – కార్యవర్గ సభ్యుడు


BAM అధ్యక్షుడు చోప్పరి సత్య మాట్లాడుతూ:
“ఈ వేడుకను విజయవంతం చేయడంలో సహకరించిన భారత హైకమిషన్, మలేషియా ప్రభుత్వ అధికారులు, అతిథులు, స్పాన్సర్లు, కమిటీ సభ్యులు మరియు మలేషియాలోని భారతీయ సమాజానికి మనఃపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement