సిడ్నీ: వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలుస్తున్న ఆస్ట్రేలియా ఎన్నారై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అభినందనలు,కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న ఆమె పార్టీ నాయకుడు చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పార్టీ కష్టకాలంలో ఉన్న వైఎస్ జగన్‌పై మీరు చూపిన ఆధారాభిమానానికి పార్టీ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుంది. మీ మద్దతు చిరస్మరణీయంగా నిలుస్తుంది’అని పేర్కొన్నారు. ‘మీ సహాయ సహకారాలు ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలుగా భరోసా ఉంటుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నారైలు మాట్లాడుతూ వైఎస్ జగన్ పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేసుకున్నారు. తమలో చాలామంది మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల విదేశాల్లో స్థిరపడ్డామని తెలిపారు. ఆ రుణం తీర్చుకునేందుకు మేము ఎల్లప్పుడూ వైఎస్ జగన్‌కు మద్దతుగా ఉంటాం’అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వీరం రెడ్డి, గజ్జల చంద్ర ఓబుల రెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డి, దూడల కిరణ్ రెడ్డి, నరెడ్డి ఉమా శంకర్, కృష్ణ చైతన్య కామరాజు, నల్ల జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


