సాక్షి, వైఎస్సార్ జిల్లా: చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటూ నిలదీశారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఐదు లక్షల మంది పెన్షన్లు కట్ చేశారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయి?. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో ప్రజలు నష్టపోతారు.’’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.
పేదలందరికీ రేషన్ బియ్యం అందాలన్నదే తమ ఆలోచన.. 8 వేల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందజేయాలన్న అవినాష్‌రెడ్డి.. రూ.480 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ పథకం ప్రారంభించింది మేమే. వాటర్ గ్రిడ్ స్కీముకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. పాపాఘ్ని నది నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. దొంగతనాలు, మట్కా, జూదం విచ్చలవిడిగా జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.
‘‘వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడంలో చంద్రబాబు సర్కార్ ఘనత సాధించింది. ప్రతి మహిళకు రూ.18 వేలు డబ్బులు ఇస్తామన్నారు. నిరుద్యోగ అభివృద్ధి రూ.3వేలు ఇస్తామన్నారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.. ఎక్కడ ఇస్తున్నారు? 66 లక్షల పెన్షన్లు వచ్చేవి.. మీ ప్రభుత్వం వచ్చాక ఐదు లక్షల పెన్షన్లను తీసేశారు’’ అంటూ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రాంతానికి కృష్ణ జలాలు వస్తున్నాయంటే వైఎస్సార్ పుణ్యమే. వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన మంచి ఈ ప్రాంత ప్రజలు, రైతులకు తెలుసు. బోగస్ మాటలు పక్కన పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆయన హితవు పలికారు.


