రాయచోటి: రాయచోటి జిల్లా కేంద్రాన్ని కొనసాగించకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి. చంద్రబాబు సహజ ధోరణి వెన్నుపోటు పొడవడమేని, అది మరోసారి రుజువైందన్నారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని రద్దు అంశం కూటమి కక్షలో భాగమేనన్నారు. క్యాబినెట్‌లో వ్యతిరేకించకుండా కన్నీరు కారిస్తే ఉపయోగం ఏంటి? అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపై మండిపడ్డారు శ్రీకాంత్‌రెడ్డి. జిల్లా కేంద్రం కోసం,జిల్లా కోసం పోరాటాలు కొనసాగిస్తామని, రేపు(మంగళవారం) రాయచోటిలో భారీ ర్యాలీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తామన్నారు శ్రీకాంత్‌రెడ్డి.
కాగా, రాయచోటి ప్రజలను సీఎం చంద్రబాబు మరోసారి మోసం చేశారు సీఎం చంద్రబాబు. గత ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసంపై రాయచోటి ప్రజలు మండిపడుతున్నారు.
రాయచోటి జిల్లా కేంద్రం రద్దు అంశానికి సంబంధించి ఏపీ కేబినెట్‌లో హై డ్రామా సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా..? లేదా..? అంటూ రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ముఖం చాటేసి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకు ఘోర అవమానమే జరిగింది.
రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తి వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజంపేటని కడప జిల్లాలో కలిపి.. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లంటూ లీకులు ఇస్తూ.. డ్రామాను రక్తి కట్టించారు.


