
అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ దేశాల్లోని సంబురాలకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఆ్రస్టేలియా, అమెరికా, దుబాయ్ దేశాల్లో జరిగిన బతుకమ్మ వేడుకలకు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. గల్ఫ్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో శనివారం దుబాయిలో జరిగిన వేడుకలకు.. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ జి.వెన్నెల గద్దర్‌తోపాటు అడువాల జ్యోతి లక్ష్మణ్, అల్లూరి కృష్ణవేణి అతిథులుగా హాజరయ్యారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో హారిస్‌బర్గ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ పండుగ సంబురాలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో హారిస్‌బర్గ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కాకర్ల శ్రీనివాస్, కార్యదర్శి మునికుమార్ గిల్లా తదితరులు పాల్గొన్నారు. ఆ్రస్టేలియాలో జరిగిన బతు కమ్మ సంబురాలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు.

ఇవీ చదవండి: సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు
జర్మనీలో అంబరాన్నంటిన.. బతుకమ్మ సంబరాలు
మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు