
యూరప్: జర్మనీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు మహిళలు ఉత్సాహంగా పాల్గొని పూల బతుకమ్మలను ఎత్తి, సాంస్కృతిక పాటలతో, నృత్యాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకున్న మహిళలు, పూలతో తయారుచేసిన బతుకమ్మలను పేర్చి చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. ఈ వేడుకలు జర్మనీ వాసులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, భోజన విందులు, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించడంతో కుటుంబ సమేతంగా పాల్గొనే వాతావరణం ఏర్పడింది. బతుకమ్మ వేడుకలు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు తమ మూలాలను గుర్తుచేస్తూ, సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.