
టెక్నాలజీ ఎన్నో ఆలోచనలకు తెరతీస్తుంది. సాంకేతిక సాయంతో దూరంగా ఉన్న తమ వాళ్లను తమవద్దకు చేర్చుకునేలా కొందరు భలే ఉపయోగిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా ఈ టెక్నాలజీని మన సంతోషాలకు, సంబరాలకు అనుగుణంగా మార్చుకుంటూ..ఇలా కూడా వాడుకోవచ్చా అని విస్తుపోయేలా చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ఏం ఉందంటే..
అసలేంటి కథ అంటే..విదేశాల్లో నివశించే చాలామంది భారత్‌లో జరిగినట్లు సంస్కృతి సంపద్రాయలకు అనుగుణంగా సంబరంగా జరిగే పండుగలను మిస్ అవుతుంటారు. ఒకవేళ అక్కడ భారత కమ్యూనిటీలంతా ఒకచోట చేరి చేసుకున్న మన దేశంలో ఉన్న మాదిరి ఆనందమైతే మిస్ అయిన వెలితి తప్పక ఉంటుంది. ఇక్కడ ఉండే పండుగ కోలాహలం, సందడి..అక్కడ ఉండదు.
అత్యంత నిశబ్దంగా జరిగిపోతుందంతే. అలా ఉసురుమనుకుండా హాయిగా ఎంజాయ్ చేసేలా..సరికొత్త మార్గాన్ని పంచుకున్నాడు కంటెంట్ క్రియేటర్, నటుడు విరాజ్ ఘేలాని. ఈ నవరాత్రిని తన ఇద్దరు ఎన్‌ఆర్‌ఐ స్నేహితుల మిస్ అవ్వకుండా..వారి ఫోటోలను చెరో చేతిలో పెట్టుకుని సంబరంగా గర్భా డ్యాన్స్ చేశాడు. తన స్నేహితులు మిస్ అవ్వకుండా వాళ్లు కూడా ఎంజాయ చేస్తున్నారనిపించేలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నవరాత్రిని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నా, అలాగే తన స్నేహితులు ఈ పండుగ మిస్ అయ్యానని బాధపడకూడదన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేశానంటూ చెప్పుకొచ్చాడు నటుడు విరాజ్ వీడియోలో.
మీరు ఇలాంటి డిజిటల్ గర్భాలో పాల్గొనేందుకు ప్రయత్నించండి, ఎందుకంటే వివిధ కారణాల రీత్యా విదేశాల్లో ఉన్నవాళ్లు నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు అని క్యాప్షన్ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశాడు. అయితే నెటిజన్లలో చాలామంది తమ దేశానికి దూరంగా ఉన్నమనే ఫీల్‌తో ఉన్నవాళ్లందరి మనసులను తాకింది ఈ వీడియో.
కానీ మరికొందరూ బాస్ భారత్‌లో తొమ్మిది రోజులే గర్భా డ్యాన్స్ చేస్తారు, అదే కాలిఫోర్నియాలో నెలల తరబడి ఆ డ్యాన్స్ చేస్తామంటూ వ్యంగంగా పోస్టులు పెట్టారు. ఏదీఏమైనా ఈ ఆలోచన మాత్రం అదుర్స్. చిన్న చిన్న పొరపచ్చలు సైతం ఇలా మనవాళ్లని భాగస్వామ్యం చేస్తే బాంధవ్యం బలపడటమే కాదు వాళ్లు ఖుషి అవుతారు.
(చదవండి: పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!)