
హైదరాబాదీ యువతి హనా అహ్మద్ ఖాన్ జూన్ 2022లో చికాగోలో పోలీస్‌గా పనిచేస్తున్న మహ్మద్ జైనుద్దీన్ ఖాన్ (అమెరికా పౌరుడు)ని వివాహం చేసుకుంది. అనంతరం ఫిబ్రవరి 2024లో ఆమె అమెరికాలోని చికాగోలో తన భర్తతో కలిసి నివసించేవారు. కొన్నాళ్లకు జైనుద్దీన్ ఖాన్ ఆమెను మానసిక వేధింపులు, శారీరక వేధింపులకు గురి చేశాడు.


గత ఆరు నెలలుగా తన భర్తను సంప్రదించడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయాన్ని, హైదరాబాద్‌లోని USA కౌన్సెలేట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని తన భర్తపై చట్టపరంగా పోరడడానికి, USAకి తిరిగి వెళ్లడానికి అవసరమైన వీసా మంజూరు చేయమంటుంది. న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయం, హైదరాబాద్‌లోని USA కౌన్సెలేట్‌కు ఆదేశాలవ్వగలరని ఆమె అభ్యర్థించింది. ఈ విషయంలో తీసువాల్సిన అవసరమైన చర్యలను తెలియజేయగలరంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు తన లేఖలో పేర్కొంది.