తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పట్టం కట్టే ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం - టాంటెక్స్ నూతన అధ్యక్షురాలిగా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన లోకిరెడ్డి మాధవి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల డాలస్‌లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో 2026 నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
ఈ మేరకు లోకిరెడ్డి మాధవి మాట్లాడుతూ..1986లో ప్రారంభమై 40వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం - టాంటెక్స్ సంస్థకు అధ్యక్షురాలిగా సేవలందించడం తన అదృష్టంగా భావిస్తున్నా. తనకు ఈ బాధ్యత ఇచ్చిన సంస్థ సభ్యులకు ధన్యవాదాలు. సంస్థ ప్రమాణాలను పెంచే నూతన కార్యక్రమాలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు." లోకిరెడ్డి మాధవి.
2026 కార్యవర్గం :
అధ్యక్షురాలు- మాధవి లోకిరెడ్డి
ఉపాధ్యక్షుడు- సునీల్ సూరపరాజు
కార్యదర్శి- ఎల్ఎన్ కోయా
కోశాధికారి- దీప్తి సూర్యదేవర
సహాయ కార్యదర్శి- వీర లెనిన్ తుళ్లూరి
సహాయ కోశాధికారి- లక్ష్మినరసింహ పోపూరి
ఉత్తరాధ్యక్షుడు- ఉదయ్ కిరణ్ నిడిగంటి
తక్షణ పూర్వాధ్యక్షుడు- చంద్రశేఖరరెడ్డి పొట్టిపాటి
కార్యవర్గ సభ్యులు- దీపికా రెడ్డి, RBS రెడ్డి, శివా రెడ్డి వల్లూరు, రవి కదిరి , అర్పిత ఓబులరెడ్డి, అనిత ముప్పిడి, పార్థ సారథి గొర్ల, శాంతి నూతి, మల్లికార్జున మురారి, పవన్ నర్రా, కమలాకర్ దేవరకొండ, వెంకట్ బొల్లా
పాలక మండలి అధ్యక్షుడు- దయాకర్ మాడా
పాలక మండలి ఉపాధ్యక్షురాలు- జ్యోతి వనం
పాలక మండలి సభ్యులు- శ్రీనాధ వట్టం, శ్రీనాధరెడ్డి పలవల, రాజారెడ్డి, ప్రవీణ్ బిల్లా, కల్యాణి తాడిమేటి
కొత్త పాలక మండలి, కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో, సరికొత్త ఆలోచనలతో 2026లో అందరిని అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ ఉంటాయని ఆశిస్తున్నానని సంస్థ నూతన అధ్యక్షులు మాధవి లోకిరెడ్డి తెలిపారు.
2025 సంవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా పని చేసి, పదవీ విరమణ చేస్తున్న తక్షణ పూర్వాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి మాట్లాడుతూ మాధవి లోకిరెడ్డి నేతృత్వంలో ఏర్పడిన 2026 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ మాధవి లోకిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. TPAD సభ్యులు అజయ్ రెడ్డి ఏలేటి, రావు కలవల, రఘువీర్ బండారు మరియు జానకిరామ్ మందాడి, TANTEX నుండి సుబ్బు జొన్నలగడ్డ, మహేష్ ఆదిభట్ల, డా. యు. నరసిమ్హారెడ్డి, సతీష్ బండారు, శారద సింగిరెడ్డి, DARA నుంచి శివారెడ్డి లేవంక, తిరుమల రెడ్డి కుంభం తదితరులు ఈ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొని మాధవికి అభినందనలు తెలిపారు.
(చదవండి: అమెరికాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు)


