
శంకర నేత్రాలయ మిచిగన్ చాప్టర్ ఆధ్వర్యంలో మూడవ వార్షిక 5K వాక్ ఘనంగా ముగిసింది. ఆదివారం, సెప్తెంబర్ 14th, 2025 నాడు స్థానిక నోవై నగరంలోని ఐటిసి స్పోర్ట్స్ పార్క్ లో ఈ వాక్ నిర్వహించారు.

శంకర నేత్రాలయ చేస్తున్న పలు రకాల సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేయడం, అదేవిధంగా సభ్యులను ఉత్తేజ పరిచి వారి ని కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేలా చేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం సాగింది. ఎంతోమంది పాత, కొత్త మెంబర్లు ఈ కార్యక్రమానికి హాజరై 5K వాక్ లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని డెట్రాయిట్ చాప్టర్ తరఫున ట్రస్టీలు ప్రతిమ కొడాలి, రమణ ముదిగంటి; మరియు చాప్టర్ లీడ్స్ వెంకట్ గోటూరు, విజయ్ పెరుమాళ్ళ, మరియు వాలంటీర్లు సాయి గోపిశెట్టి, సుజాత తమ్మినీడి, తేజ జెట్టిపల్లి, వంశీ గోపిశెట్టి, మరియు యూత్ వాలంటీర్లు సమన్వయపరిచారు. శంకర నేత్రాలయ ప్రెసిడెంట్ డాక్టర్ బాలరెడ్డి ఇందుర్తి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తమ సూచనలు అందజేశారు. టి త్యాగరాజన్ టెక్నికల్ సహాయం అందజేసారు.

ఈ 5K వాక్‌లో రెండు క్యాటగిరీలుగా విజేతలను ప్రకటించారు. విజేతలకు బహుమతులను అందింపజేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన సభ్యులకు, కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందించిన పలువురు సభ్యులకు, శంకర నేత్రాలయ కార్యనిర్వాహక సంఘం డెట్రాయిట్ చాప్టర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
